BigTV English

Kobbari Bobbatlu: దీపావళికి స్పెషల్ రెసిపీ కొబ్బరి బొబ్బట్టు, ఇది ఎంతో టేస్టీ చేయడం చాలా సులువు

Kobbari Bobbatlu: దీపావళికి స్పెషల్ రెసిపీ కొబ్బరి బొబ్బట్టు, ఇది ఎంతో టేస్టీ చేయడం చాలా సులువు
Kobbari Bobbatlu: కొబ్బరి బొబ్బట్లు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఒక్కసారి వాటిని తిని చూడండి. జీవితంలో మర్చిపోలేరు. దీపావళికి కొబ్బరి బొబ్బట్లు చేసే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం కూడా దుక్కుతుంది.  తెలుగువారికి బొబ్బట్లతో ఉన్న బంధం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ శనగపప్పు తో చేసే బొబ్బట్లనే కాదు ఓసారి కొబ్బరి బొబ్బట్లు ప్రయత్నించండి. వేడివేడి కొబ్బరి బొబ్బట్టుపై నెయ్యి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. దీపావళి రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా స్వీట్ ను పెడతారు. ఆ స్వీట్ ని కూడా కొబ్బరి బొబ్బట్లు రూపంలో పెట్టవచ్చు. బొబ్బట్లును పూరాన్ పోలి అని పిలుస్తారు. ఈ కొబ్బరి బొబ్బట్లు చేయడం చాలా సులువు. ఎక్కువగా ఉత్తర భారత దేశంలో కొబ్బరి బొబ్బట్లు చేస్తూ ఉంటారు. వీటిని ఎలా చేయాలో తెలుసుకోండి.


కొబ్బరి బొబ్బట్లు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మైదా లేదా గోధుమపిండి – ఒక కప్పు
బెల్లం తురుము – ఒక కప్పు
తురిమిన తాజా కొబ్బరి – ఒక కప్పు
నెయ్యి – మూడు స్పూన్లు
ఉప్పు – చిటికెడు
యాలకుల పొడి – అర స్పూను
నూనె – రెండు స్పూన్లు
నీళ్లు – సరిపడినన్ని
పసుపు – పావు స్పూను

Also Read: 40 ఏళ్లలో కూడా 20 ఏళ్ల లాగా కనిపించాలంటే.. ప్రతి రోజు ఇవి తినాల్సిందే !

కొబ్బరి బొబ్బట్టు రెసిపీ
1. ఒక గిన్నెలో మైదా లేదా గోధుమ పిండిని తీసుకోండి.
2. కొంతమంది బొబ్బట్లు మైదాతో చేస్తే మరికొందరు గోధుమపిండితో చేస్తారు. ఏది ఎంచుకోవాలన్నది మీ ఇష్టమే.
3. ఇప్పుడు ఆ గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసి నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలాగా కలుపుకోండి.
4. ఒక పావుగంటసేపు పైన మూత పెట్టి పక్కన పెట్టేయండి.
5. ఇప్పుడు కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోండి.
6. స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం వేసి నీళ్లు వేయండి.
7. ఆ బెల్లం కరిగే వరకు ఉంచండి. బెల్లంలో ఉండే మలినాలు పైకి తేలిపోతాయి.
8. వాటిని వడకట్టి పక్కన పెట్టుకోండి. ఆ బెల్లం మిశ్రమంలో ముందుగా తురిమిన కొబ్బరి, యాలకుల పొడి వేసి బాగా కలపండి.
9. ఆ మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి.
10. కొబ్బరి దగ్గరగా హల్వాలాగా అయ్యేంతవరకు గరిటెతో కలుపుతూనే ఉండండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
11. ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం చల్లారే వరకు ఉంచండి.
12. అది చల్లారాక చిన్న చపాతీ ముద్దను తీసుకొని పూరీలాగా ఒత్తి మధ్యలో ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి మడత పెట్టండి. తిరిగి దాన్ని గుండ్రంగా ఒత్తండి.
13. స్టవ్ మీద పెనం పెట్టి కాస్త నెయ్యి లేదా నూనె వేసి ఈ బొబ్బట్టు రెండు వైపులా కాల్చండి. అంతే టేస్టీ కొబ్బరి బొబ్బట్టు రెడీ అయినట్టే.
14. ఇలా అన్నింటినీ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి.
15. ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. దీని రుచి ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. వీటిని చేయడం పెద్దగా కష్టం కాదు.


బొబ్బట్ల రెసిపీలో మైదాకు బదులు గోధుమ పిండిని ఎంపిక చేసుకోవడమే మంచిది. మైదాలో ఎన్నో రకాల రసాయనాలను కలుపుతారు. గోధుమ పిండిలో అలాంటి రసాయనాలు ఏవీ ఉండవు. కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మైదాతో చేసిన బొబ్బట్టు మృదువుగా ఉంటే గోధుమపిండితో చేసిన బొబ్బట్టు కాస్త మందంగా ఉంటుంది. కానీ రుచిలో మాత్రం అద్భుతంగానే ఉంటుంది. ఒకసారి కొబ్బరి బొబ్బట్ల రెసిపీని ఫాలో అయి చూడండి. మీకు కచ్చితంగా నచ్చడం ఖాయం.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×