BigTV English

White Hair: తెల్లజుట్టు నల్లగా మార్చడానికి.. వీటిని మించినది లేదు !

White Hair: తెల్లజుట్టు నల్లగా మార్చడానికి.. వీటిని మించినది లేదు !

White Hair: తెల్ల జుట్టు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వైయిట్ హెయిర్‌తో సతమతం అవుతున్నారు. ఇదిలా ఉంటే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొంత మంది బయట మార్కెట్ లో దొరికే హెయిర్ కలర్స్ వాడుతుంటారు. వీటి వల్ల తాత్కాలికంగా రిజల్ట్ వచ్చినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం అలవాటు చేసుకోండి.


హోం రెమెడీస్ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా జుట్టు పెరగడానికి కూడా దోహదం చేస్తాయి. మరి తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఏ ఏ హోం రెమెడీస్ ఉపయోగపడతాయో, వాటిని ఎలా తయారు చేసుకోవాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు:
కొన్ని కరివేపాకులను తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో రెండు లేదా మూడు చెంచాల ఆమ్లా పౌడర్ , బ్రాహ్మి పౌడర్ కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ ప్యాక్ ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టు మొత్తానికి అప్లై చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి, తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే పోషకాలు జుట్టు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి.


కాఫీ ప్యాక్:
కాఫీ యొక్క సహజ రంగు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. దీని కోసం, ఒక పాత్రలో ఒక కప్పు నీటిని వేడి చేయండి. తరువాత అందులో ఒక చెంచా కాఫీ పొడి కలపండి. నీరు చల్లబడిన తర్వాత దానికి హెన్నా పౌడర్ వేసి పేస్ట్ లాగా చేయండి. ఇప్పుడు దానిని మొత్తం జుట్టు మీద పూర్తిగా అప్లై చేసి ఒక గంట పాటు ఉంచండి. ఆ తర్వాత షాంపూతో కడగాలి.

కలబంద జెల్:
తెల్ల జుట్టు కోసం మీరు కలబందను ఉపయోగించడం కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ సిద్ధం చేయడానికి కాస్త కలబంద జెల్ తీసుకొని అందులో నిమ్మరసం కలిపి, ఇప్పుడు ఈ పేస్ట్‌ను జుట్టు మూలాల నుండి ప్రారంభించి మొత్తం జుట్టుకు అప్లై చేయండి. మీరు ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవచ్చు. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆవాల నూనె:
ఆవాల నూనె కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది తెల్ల జట్టు సమస్యను కూడా నల్లగా మార్చడానికి చాలా మేలు చేస్తుంది.
తెల్ల జుట్టుకు ఆవ నూనె మీకు గొప్ప పరిష్కారం. కొన్ని రకాల పదార్థాలతో కలిపి వాడటం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గడమే కాకుండా, మీ జుట్టు మందంగా ,బలంగా మారుతుంది..

1. ఆవాల నూనె ,మెంతి గింజలు:
మీరు తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతుంటే, ఆవాల నూనె , మెంతి గింజల మిశ్రమం మీ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . మెంతి గింజల్లో ఉండే ప్రోటీన్, ఇనుము జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా తెల్ల జుట్టును సహజంగా నల్లగా ఉంచుతాయి.అంతే కాకుండా ఇది జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి ?
దీన్ని తయారు చేయడానికి ముందుగా అర కప్పు ఆవాల నూనెలో 2 టీస్పూన్ల మెంతులు కలపండి. ఆ తరువాత మెంతులు ముదురు రంగులోకి వచ్చే వరకు తక్కువ మంట మీద వేడి చేయండి. చల్లారిన తర్వాత దానిని వడకట్టి జుట్టు మూలాలకు బాగా అప్లై చేసి గంట తర్వాత షాంపూతో కడగాలి. మీరు ఈ రెమెడీని వారానికి రెండుసార్లు అప్లై చేసుకోవచ్చు.

Also Read: విపరీతంగా జుట్టు రాలుతోందా ? ఈ టిప్స్ మీ కోసమే !

2. ఆవాల నూనె, ఉసిరి:
ఉసిరి జుట్టుకు సహజ టానిక్‌గా పనిచేస్తుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఆవ నూనె , ఉసిరిల మిశ్రమం జుట్టుకు పోషణను అందించడంలో, దాని బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది .

ఎలా ఉపయోగించాలి ?
దీని కోసం అర కప్పు ఆవ నూనెలో 2 టీస్పూన్ల ఉసిరి పొడి కలపండి.
కొంత సమయం తర్వాత దానిని కొద్దిగా వేడి చేసి చల్లబడిన తర్వాత జుట్టుకు బాగా అప్లై చేయండి.
1-2 గంటలు అలాగే ఉంచి ఆపై షాంపూతో శుభ్రం చేసుకోండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×