BigTV English
Advertisement

Trump Iran Attack Plan : ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరాన్.. భారీ బాంబు దాడులకు ప్లాన్

Trump Iran Attack Plan : ట్రంప్ తదుపరి టార్గెట్ ఇరాన్.. భారీ బాంబు దాడులకు ప్లాన్

Trump Iran Attack Plan MOAB Bomb | ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన భారీ బాంబు (అణుబాంబు శ్రేణి కానిది)ని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశంపై ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ అత్యంత శక్తివంతమైన బాంబు ఒక నాన్-న్యూక్లియర్ బాంబు. దీనినే మోబ్ బాంబు (MOAB) అని పిలుస్తారు. దీని పూర్తి పేరు GBU-43/B మాసివ్ ఆర్డినన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్. ఇది జీపీఎస్ గైడెడ్ బాంబు. ఈ బాంబుని ఇజ్రాయెల్ అమ్ములపొదిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఇజ్రాయెల్ కు బహుమతిగా అమెరికా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అణు బాంబు తయారీ ఉద్దేశాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తున్న తరుణంలో ఈ మోబ్ బాంబు వినియోగంలోకి రానుంది.


ఇజ్రాయెల్-అమెరికా సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఇటీవల సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ చర్చల దరిమిలా, అమెరికా నుంచి మోబ్ బాంబును ఇజ్రాయెల్ స్వీకరించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ తనను అంతమొందించే పక్షంలో, ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని ట్రంప్ ఇప్పటికే శ్వేతసౌధానికి సూచనలు ఇచ్చినట్టు ప్రకటించారు. ఇరాన్ ఇటీవల అణ్వాయుధాల ఊపుపై కేంద్రీకరించిన నేపథ్యంలో, మోబ్ బాంబు వార్తలు పశ్చిమాసియా ప్రాంతాన్ని కలవరపెడుతున్నాయి.

ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలు
సంవత్సరాలు కాకుండా, నెలల వ్యవధిలోనే అణ్వస్త్రాన్ని తయారు చేసే మార్గాలను ఇరాన్ శాస్త్రవేత్తలు చురుగ్గా అన్వేషిస్తున్నారని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఒక వార్తాకథనంలో ప్రచురించింది. ఈ నేపథ్యంలో, ఇరాన్ అణు పరిశోధనా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడానికి మోబ్ బాంబును అమెరికా ఇజ్రాయెల్‌కు పంపుతోందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read: ట్రంప్ క్రిమినల్ మైండ్.. నేరస్తులను భయంకరమైన జైలులో పెట్టాలని ప్లాన్

మోబ్ బాంబు యొక్క శక్తి
30 అడుగుల పొడవైన మోబ్ బాంబులో 11 టన్నుల పేలుడు పదార్థం (టీఎన్టీ- ట్రైనైట్రోటోలీన్) ఉంటుంది. దీని పేలుడు ప్రభావానికి 300 మీటర్ల వెడల్పున పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. ఈ బాంబును మొదటిసారిగా 2003లో పరీక్షించారు. 2017లో అఫ్ఘనిస్తాన్లోని ఇసిస్ బంకర్లను లక్ష్యంగా చేసుకుని దీనిని ప్రయోగించారు. ఈ బాంబు భారీ విస్ఫోటనాన్ని కలిగిస్తుంది. ఇది భవనాలను నేలమట్టం చేయగలదు. భూగర్భ సొరంగాల్లోని లక్ష్యాలను 200 అడుగుల లోతు వరకు ఛేదించగలదు. ఈ బాంబు పేలినప్పుడు భూమి కంపిస్తుంది, అగ్నిగోళం ప్రజ్వరిల్లి, ఆకాశం నుంచి భూమిపైకి పడినట్లుగా భయంకరమైన ప్రభావాన్ని చూపుతుంది.

ఇరాన్ సర్వోన్నత నేత ఖమేనీ హమాస్ నేతలతో భేటీ
మరోవైపు ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ శనివారం హమాస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. యూదుల పాలనను, నిజానికి అమెరికాను గాజా ప్రజలు ఓడించారని, వారి లక్ష్యాల్లో ఒక్కటీ కూడా సాకారం కాకుండా చూడగలిగారని ఖమేనీ చెప్పినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తాసంస్థ ‘ఇర్నా’ వెల్లడించింది. ఖమేనీతో సమావేశంలో హమాస్ షురా కౌన్సిల్ ఛైర్మన్ మహమ్మద్ ఇస్మాయిల్ డార్విష్‌, హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ ఛైర్మన్ ఖలీల్ అల్ హయ్యా లు పాల్గొన్నారని సమాచారం. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరిపిన హమాస్ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×