Car Stunts: హైదరాబాద్ రోడ్లపై కార్ల స్టంట్లతో కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు. కార్లు, బైకులపై విన్యాసాలు చేస్తూ జనాలను భయపెడుతున్నారు. కార్లు విన్యాసాలపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ఎన్ని హెచ్చిరకలు చేసినా.. ఆకతాయిలు మాత్రం ఆగడంలేదు. రాత్రులు, తెల్లవారుజామున కార్లతో రెసింగ్‌లు నిర్వహిస్తూ.. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. వారి జీవితాలను ప్రమాదకరంలోకి నెట్టడమే కాకుండా.. ఇతర వాహనాదారుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నడిరోడ్డుపై లగ్జరీ కార్లతో స్టంట్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు బయటికి వచ్చాయి. కార్లతో స్టంట్స్ చేస్తూ.. నానా రచ్చ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు.. ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న స్టంట్లు.. తోటివారికి కూడా ప్రాణాలు మీదకి తెస్తున్నారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. కార్లు, బైకులతో ఫీట్లు చేస్తూ.. సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు. వైరల్ అవడం కోసం జనాలను భయాందోళనకు గురిచేస్తున్నారు. రోడ్లపై చేసే విన్యాసాలతో ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని రోడ్లు తమదే అన్నంత ధీమాతో చేసే స్టంట్లు ప్రమాదాలకు గురిచేస్తున్నాయి.
భయం, బాధ్యత లేకుండా ఇలా ఫీట్లు చేస్తున్నారంటే.. వారికి ప్రాణాలంటే లేక్కలేదని అనుకునేలా ఉన్నాయి. వారి సరదాలు, సంతోషాల కోసం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టడమే కాకుండా.. కుటుంబ సభ్యులు తమపై పెట్టుకున్న ఆశల్ని కూడా పట్టించుకోవట్లేదని అర్ధమవుతుంది.
ఎంతో కష్టపడి తమ పిల్లలకు కార్లు, బైకులు కొనిపెడుతుంటారు. కానీ చాలా మంది యువకులు ఏమాత్రం బాధ్యత లేకుండా.. ఇలా రోడ్లపై స్టంట్స్ చేస్తూ.. ప్రాణాలుపోగొట్టుకున్న సందర్భాలు ఇటీవల మనం చూస్తేనే ఉన్నాం. అయినా సరే ఇటువంటి ఆగడాలు ఆగడం లేదు. ఆకతాయిల విన్యాసాలకు అడ్డుకట్టు పడటం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కొందరు యువకులు రెచ్చిపోయారు. కార్లతో స్టంట్లు చేస్తూ.. నానా హంగామా చేశారు. నడిరోడ్డుపై లగ్జరీ కార్లతో యువకులు స్టంట్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు బయటికి వచ్చాయి. అసలు వీటి వెనక ఉన్నదెవరన్నది తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన స్టంట్ల దృశ్యాల ఆధారంగా.. స్టంట్స్ చేస్తున్నవారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
Also Read: బీజేపీ టార్గెట్ ఫిక్స్.. తెలంగాణపై ఫోకస్, కూటమి నేతలతో మంతనాలు
ఇదిలా ఉంటే.. కొడుకు మారాం చేస్తున్నాడని.. ఇంట్లో సరుకులు తేవాలని.. ఇలా అవసరాల నిమిత్తం మైనర్లకు బైక్ తాళాలు ఇస్తుంటారు తల్లిదండ్రులు. పోలీసులు ఎంత హెచ్చరించినా బేఖాతరు చేసేవాళ్లే ఎక్కువ. అలా జరిగిన ప్రమాదాలే తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతుంటాయి. మైనర్లకు బైక్ డ్రైవింగ్ ఇస్తే ఏం జరుగుతుందో ఈ ఘటన మరో ఉదాహరణ. నిర్మల్ జిల్లా వానల్ పాడ్‌కు చెందిన అనిల్ అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ నేర్చుకోవాలని తండ్రికి చెప్పకుండా ఇంటి నుంచి బైక్‌తో వెళ్లిన అనిల్.. రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సెలవు నిమిత్తం నిన్ననే హాస్టల్ నుంచి వచ్చిన కొడుకు.. విగతజీవిగా ఇంటికి తిరిగొచ్చాడు. విషయం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.