Castor Oil: జుట్టు ఒత్తుగా ఉంటేనే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాము. కానీ చాలా మంది ప్రస్తుతం జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తరుచుగా జుట్టు రాలడం వల్ల బట్టతల రావడం మొదలవుతుంది. అంతే కాకుండా జుట్టు మెరుపు కూడా పూర్తిగా మాయమైపోయింది. కాబట్టి ఈ రెండు సమస్యలను ఎదుర్కోవడానికి మొదట చేయాల్సింది జుట్టుకు నూనె అప్లై చేయడం.
మొదటి అడుగు నూనె రాయడం.జుట్టు రాలుతున్నప్పుడు ఏ ఆయిల్ వాడాలనే విషయంపై చాలా మందికి సందేహం ఉంటుంది. అంతే కాకుండా ఆయిల్ జుట్టుకు ఎలా అప్లై చేయాలి ? వారానికి ఎన్ని సార్లు అప్లై చేయాలి ? ఇలా అన్ని ప్రశ్నలు మీ మదిలో మెదులుతాయి కాబట్టి ఈ రోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు సంబంధించిన సమాధానాలు తెలుసుకుందాం.
జుట్టు రాలుతున్నట్లయితే మీరు ఆముదం నూనెను వాడటం మంచిది. వీటిలో ఉండే అద్భుతమైన గుణాలు జట్టు రాలడాన్ని నివారిస్తాయి. అంతే కాకుండా జుట్టు పెరిగేందుకు ఉపయోగపడతాయి.
ఇలా జుట్టుకు ఆముదం ఉపయోగించండి..
– ఒక గిన్నెలో రెండు చెంచాల ఆముదం, కొబ్బరి నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ నూనెతో తలకు 5 నిమిషాల పాటు అప్లై చేయండి.
– మూలాల నుండి జుట్టు పొడవు వరకు నూనెను పూర్తిగా రాయండి.
– దీని తర్వాత, షవర్ క్యాప్ లేదా టవల్ తో తలను పూర్తిగా కప్పుకోండి.
– జుట్టును కనీసం 2 గంటలపాటు ఇలానే ఉంచాలి. ఉత్తమ ఫలితాల కోసం రాత్రిపూట జుట్టుకు అప్లై చేసుకోండి.
– ఉదయం షాంపూ, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
ఎంత మోతాదులో ఆయిల్ ఉపయోగించాలి ?
వారానికి రెండు సార్లు రెండు నెలల పాటు నిరంతరంగా నూనె రాయండి. మీరే తేడాను స్పష్టంగా చూస్తారు.
జుట్టుకు ఆముదం రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆముదంలో యాంటీ ఫంగల్ ,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చుండ్రును పెంచే ఫంగస్ , ఇతర రకాల ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. దీని వల్ల దురద, చికాకు సమస్య తగ్గుతుంది. ఇదే కాకుండా, ఇది స్కాల్ప్ యొక్క pH స్థాయిని కూడా నిర్వహిస్తుంది. అంతే కాకుండా చుండ్రు అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది.
ఆముదం కూడా జుట్టు బూడిద రంగులోకి మారకుండా చేస్తుంది. జుట్టు బూడిద రంగులోకి మారకుండా నిరోధించడానికి చాలా తక్కువ మొత్తంలో ఆముదం నూనె సరిపోతుంది.
Also Read: పంచదార కంటే బెల్లం తింటేనే మంచిది, ఎందుతో తెలుసా ?
ఆముదం తరుచుగా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా , దృఢంగా మారుతుంది.
ఆముదం తరుచుగా జుట్టు అప్లై చేయడం వల్ల చుండ్రు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా జుట్టు నల్లగా ఉంటుంది.
తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడే వారు ఆముదం నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.