Koneru Humpy: ప్రపంచస్థాయి చెస్ పోటీలలో భారత ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా దేశం న్యూయార్క్ వాల్ స్ట్రీట్ లో జరిగిన ఫీడే వరల్డ్ రాపిడ్ ఛాంపియన్షిప్ 2024 లో భారత క్రీడాకారిని, తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. దీంతో {Koneru Humpy} తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ టైటిల్ ని సొంతం చేసుకుంది. చదరంగపు ఆటలో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంది కోనేరు హంపి.
Also Read: Pro Kabaddi League 2024 Final: నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్..ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?
చెక్ పెడితే ఎంతటి వారైనా తలవంచక తప్పదని {Koneru Humpy} చాటి చెప్పింది. ఈ పోటీల్లో ఆమె 8.5 పాయింట్స్ లతో ప్రత్యర్థి అయిన ఇండోనేషియా ప్లేయర్ ఇరిన్ కరిష్మా సుకందర్ పై విజయం సాధించింది. ఉత్కంఠ గా సాగిన 11వ రౌండ్ లో కోనేరు హంపి గెలుపొంది భారత గౌరవాన్ని మరింత పెంపొందించింది. నల్ల పావులతో ఆడిన హంపి ధాటికి 11 రౌండ్ లో చేతులెత్తేసింది సుకందర్. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో టైటిల్ ని గెలవడం హంపి కెరీర్ లో ఇది రెండవసారి.
ఇంతకుముందు 2019 సంవత్సరంలో మాస్కోలో జరిగిన వరల్డ్ రాపిడ్ టోర్నమెంట్ లో విజయం సాధించిన హంపి.. ఇప్పుడు మరోసారి విజయకేతనం ఎగరవేసింది. మొత్తం ఆరు మంది ఈ టైటిల్ కోసం పోటీ పడి ఫైనల్ రౌండ్ వరకు వచ్చారు. కానీ సగటున 8.5 పాయింట్ లతో ఫైనల్స్ ఆడే అర్హతను సాధించింది కోనేరు హంపి. కాగా చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తరువాత ఎక్కువ సార్లు టోర్నీలో గెలిచిన జాబితాలో హంపి రెండవ స్థానంలో నిలిచింది.
ఇక పురుషుల విభాగంలో 9 రౌండ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో ఉన్న భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి చివర్లో వెనుకబడిపోయాడు. పురుషుల రాపిడ్ ఈవెంట్ లో 18 ఏళ్ల వో లాదర్ ముర్జిన్ విజేతగా నిలిచాడు. రష్యా కి చెందిన ఈ యువ గ్రాండ్ మాస్టర్ 10 పాయింట్లు సాధించి ఛాంపియన్ గా అవతరించాడు. ఇంతకుముందు నోబిర్ బెక్ అబ్దుసట్టోరోవ్ 17 సంవత్సరాల వయసులో ఈ రాపిడ్ చెస్ టైటిల్ ని గెలిచాడు.
Also Read: Australia vs India, 4th Test: టీమిండియా ఆల్ అవుట్… 19 ఏళ్ల కుర్రాడి పై రివెంజ్ తీర్చుకున్న బుమ్రా
ఇక జాతీయనిగా నిలిచిన కోనేరు హంపిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. హంపి విజయం దేశానికే గర్వకారణమని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2024 భారత దేశ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని పేర్కొన్నారు చంద్రబాబు. మరోవైపు కోనేరు హంపికి మంత్రి నారా లోకేష్ కూడా అభినందనలు తెలియజేశారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం కోనేరు హంపి సొంతమని లోకేష్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి భావితరాలకు హంపి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు నారా లోకేష్.
What a proud moment for India! Congratulations to Koneru Humpy on winning the FIDE Women’s World Rapid Chess Championship 2024. Her incredible triumph caps off a phenomenal year for Indian chess! pic.twitter.com/DB4KqEMUMO
— N Chandrababu Naidu (@ncbn) December 29, 2024