BigTV English

Parrot Fever : కలవరపెడుతున్న ప్యారెట్ ఫీవర్.. ఎలా వ్యాపిస్తుంది ? వ్యాధి లక్షణాలు, చికిత్స వివరాలు

Parrot Fever : కలవరపెడుతున్న ప్యారెట్ ఫీవర్.. ఎలా వ్యాపిస్తుంది ? వ్యాధి లక్షణాలు, చికిత్స వివరాలు


Parrot Fever in Europe Countries : ప్రాణాంతకమైన ప్యారెట్ ఫీవర్ ఐరోపా దేశాలను వణికిస్తోంది. బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ కారణంగా వ్యాపించే ఈ శ్వాసకోశ వ్యాధి కారణంగా అనేక యూరోపియన్ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాలలో ప్యారెట్ ఫీవర్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్యారెట్ ఫీవర్ కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది.

క్లామిడియా పిట్టాసి (Chlamydia Pittaci) అనే బ్యాక్టీరియా కారణంగా పిట్టకోసిస్ (Pittacosis) అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధినే ప్యారెట్ ఫీవర్ గా పిలుస్తారు. అడవి జంతువులు, పెంపుడు పక్షులు, పౌల్ట్రీ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లోనే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. అధికారికంగా నమోదయ్యే కేసుల కంటే.. ఇంకా ఎక్కువ స్థాయిలోనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లలో వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి.


అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (USDSC) ప్రకారం.. ప్యారెట్ ఫీవర్ సోకిన పక్షుల మల, మూత్ర విసర్జనలతో పాటు.. అవి ఎగిరినప్పుడు వచ్చే దుమ్ము, ధూళి కణాలను పీల్చడం వల్ల కూడా వ్యాధి సంక్రమిస్తుంది. అంతేకాదు.. పక్షులు కరవడం వల్ల కూడా పిట్టకోసిస్ వస్తుంది. అయితే వ్యాధి సోకిన జంతువులను తినడం వల్ల అయితే వ్యాధి వ్యాపించదని చెబుతున్నారు. ఒకరికి ఈ వ్యాధి సోకితే.. అది క్రమంగా మరొకరికి వ్యాపిస్తుంది. కానీ.. ప్యారెట్ ఫీవర్ కేసుల్లో ఇప్పటి వరకూ అలా సంక్రమించిన దాఖలాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్యారెట్ ఫీవర్ లక్షణాలు, చికిత్స

ఈ వ్యాధి సోకిన వారిలో తొలుత ఎలాంటి లక్షణాలు కనిపించవు. 5 – 14 రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. తల, కండరాలు నొప్పి, పొడి దగ్గు, జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి. యాంటీబయాటిక్స్ ఈ చికిత్సకు ఉపయోగపడతాయి. ప్యారెట్ ఫీవర్ లో మరణాల రేటు చాలా తక్కువ. అయినప్పటికీ ఐదుగురు మరణించడం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. స్వీడన్ లో 2017 నుంచి ప్యారెట్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో 26 కేసులు నమోదైతే.. ఈసారి 13 కేసులు నమోదయ్యాయి.

Tags

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×