Ritika Nayak:రితిక నాయక్ (Ritika Nayak).. తేజ సజ్జ(Teja Sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో వచ్చిన ‘మిరాయ్’ సినిమాలో ఒక లక్ష్యం కోసం హీరోని ముందుకు నడిపించే పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరిని అబ్బురపరిచింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో రితికా పేరు బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పలు షాపింగ్ మాల్స్ నిర్వహకులు ఈమె చేత ఘనంగా లాంఛ్ చేయిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాదులోని చందానగర్ లో ఉన్న గోయాజ్ సిల్వర్ జువెలరీ 18వ స్టోర్ ను రితికా నాయక్ ఘనంగా ప్రారంభించింది. ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి రితిక తో పాటు ప్రియాంక కూడా సందడి చేశారు. భారతదేశపు అతిపెద్ద వెండి ఆభరణాల గమ్యస్థానం గోయాజ్ సిల్వర్ జువెలరీ ప్రారంభోత్సవంలో రితిక మాట్లాడుతూ.. “ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. సిల్వర్ జువెలరీ కేటగిరీలో కొత్త నిర్వచనాన్ని సృష్టిస్తూ.. వేగంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఇప్పుడు చందానగర్లో స్టోర్ ని పెట్టడం ప్రత్యేకం” అంటూ ఆమె తెలిపింది.
ALSO READ:Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!
గోయాజ్ అధినేత ప్రియాంక మాట్లాడుతూ.. “మా ఈ స్టోర్ సిల్వర్ జువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అద్భుతమైన , విస్తృతమైన కలెక్షన్లతో ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవం ఇస్తుంది. వివాహ, వివిధ పండుగలకు అన్ని సందర్భాలకు ఒకే చోట ఆభరణాలు అందుబాటులో ఉండడంతో పాటు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా స్టోర్ ప్రారంభించి ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాం” అంటూ తెలిపారు.
ఈ ఆఫర్లు అక్టోబర్ 11 నుండి 26 వరకు అందుబాటులో ఉంటాయి:
రూ. 1,00,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే – రూ. 50,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ (ఎంపిక చేసిన డిజైన్స్) ఉచితం
రూ. 50,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే – రూ. 25,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ (ఎంపిక చేసిన డిజైన్స్) ఉచితం
రూ. 25,000 విలువైన సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే – రూ. 12,500 విలువైన సిల్వర్ జ్యువెలరీ (ఎంపిక చేసిన డిజైన్స్) ఉచితం, అని గోయాజ్ వారు ప్రకటించారు.