Coconut Oil For Skin: ముఖం అందంగా మెరుస్తూ ఉండటానికి చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది. ముఖ్యంగా కొబ్బరి నూనె ముఖానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అంతే కాకుండా ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది. రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడే బదులు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంతకీ ముఖం కాంతివంతంగా మారడానికి కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి. దీని వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి నూనె, పసుపు:
పసుపులో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అంతే కాకుండా మచ్చలను తగ్గిస్తాయి. కొబ్బరి నూనెతో పసుపు కలిపినప్పుడు, ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకు పోతుంది. అంతే కాకుండా సహజమైన మెరుపును అందిస్తుంది.
వాడే విధానం:
ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో అర టీస్పూన్ పసుపు పొడి కలపండి.
ఈ పేస్ట్ ని చేతులతో ముఖం మీద అప్లై చేయండి.
10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి.
ఈ మిశ్రమం మచ్చలు, పిగ్మెంటేషన్, టానింగ్‌ను తగ్గిస్తుంది, అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
2. కొబ్బరి నూనె, తేనె:
తేనె అనేది చర్మంలో తేమను నిలుపు కోవడంలో సహాయపడే సహజమైన మాయిశ్చరైజర్. కొబ్బరి నూనె చర్మానికి పోషణ నిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని పొడి బారకుండా తగ్గిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడటం శీతాకాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వాడే విధానం:
ఒక చెంచా కొబ్బరి నూనె తీసుకుని, ఒక చెంచా తేనెతో కలపండి.
దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఇలాగే వదిలేయండి.
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, సున్నితంగా తుడవండి.
ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా సహజమైన మెరుపును తెస్తుంది.
3. కొబ్బరి నూనె, అలోవెరా జెల్:
కలబందలోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఉపశమనం చేస్తాయి. అంతే కాకుండా ఇవి శరీరానికి అవసరం అయిన తేమను కూడా అందిస్తాయి. కొబ్బరి నూనెతో అలోవెరా జెల్ కలిపి వాడితే.. ఇది చర్మాన్ని లోతుగా మరమ్మతు చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలను కూడా తొలగిస్తుంది.
Also Read: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్
వాడే విధానం:
రెండు టీ స్పూన్ల కలబంద జెల్‌ను ఒక టీస్పూన్ కొబ్బరి నూనెతో కలపండి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ లాగా అప్లై చేయండి.
20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.
ఇది ముఖం నుండి అలసటను తొలగించి తాజాగా ఉంచుతుంది.అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో కూడా సహాయ పడుతుంది.