Big Stories

Influenza Vaccine : ఇన్‌ఫ్లుఎంజా వైరస్.. ఈ నెలలోనే విజృంభణ..!

flu vaccine

- Advertisement -

Influenza Vaccine : ఇన్‌ఫ్లుఎంజా అనేది ఒక అంటువ్యాధి. ఈ వైరస్ ప్రతేడాది యునైటెడ్ స్టేట్స్ చూట్టూ వ్యాపిస్తుంది. సాధారణంగా ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ప్రభావం అక్టోబర్, మే నెలల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్లు వయసు పైబడినవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు సోకుతుంది. కొన్ని సందర్భాల్లొ వారి ప్రాణాలు కూడా పోవచ్చు.

- Advertisement -

ఇన్‌ఫ్లూఎంజా సోకిన వ్యక్తులకు ఊపిరితిత్తులు, ముఖం ఉబ్బడం, చెవి ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీకు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ప్రభావం ఎక్కువైనట్లయితే చలి జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, అలసట, దగ్గు, తలనొప్పి మరియు ముక్కు కారడం లేదా మూసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి వాంతులు ,విరేచనాలు కూడా ఉండవచ్చు.

Read More : క్యాన్సర్‌ కణితలు పెరగడానికి అసలు కారణం.. నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..?

దీని ప్రభావం పెద్దల కంటే పిల్లలపై అధికంగా ఉంటుంది. ఇన్‌ఫ్లూఎంజా వైరస్ వల్ల యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతేడాది వేలాది ఆస్పత్రి పాలవుతున్నారు. అలానే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇన్‌ఫ్లుఎంజా టీకాలను 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు తీసుకోవాలి. ఫ్లూ సీజన్‌లో ప్రభుత్వం ఈ టీకాలును ఇస్తుంది.

6 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్న వారికి రెండు డోసుల్లో ఈ టీకాలను ఇస్తున్నారు. 8 సంవత్సరాలు పైబడినవారు ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది. టీకా పనిచేయడానికి రెండు వారాల సమయం పడుతుంది. ఇన్‌ఫ్లుఎంజా అనేది అనేక వైరస్‌లతో కలిసి ఉంటుంది. వైరస్ ఎల్లప్పుడూ కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ నుంచి ప్రజల్ని రక్షించడానికి శాస్త్రవేత్తలు ప్రతేడాది కొత్త టీకాను ఉత్పత్తి చేస్తున్నారు.

Read More : మీ శరీరంలో ఈ మార్పులు ఉంటే.. బర్డ్ ఫ్లూ ఉన్నట్లే..!

ఇన్‌ఫ్లుఎంజా టీకాను గర్భధారణ సమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. వైరస్ వ్యాప్తి చెందే సీజన్‌లో ఈ వ్యాక్సిన్‌ను గర్భిణీలు కచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడేవారు ఈ టీకాను తీసుకోకూడదు. ఇన్‌ఫ్లుఎంజా టీకా తీసుకున్న తర్వాత జ్వరం,కండరాల నొప్పులు మరియు తలనొప్పి రావొచ్చు. చిన్నపిల్లలు అయితే జ్వరం వల్ల మూర్ఛ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది.

Disclaimer : ఈ సమాచారాన్ని పలు వైద్య అధ్యాయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు మేరకు అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News