BigTV English

Cancer : క్యాన్సర్‌ కణితలు పెరగడానికి అసలు కారణం.. నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..?

Cancer : క్యాన్సర్‌ కణితలు పెరగడానికి అసలు కారణం.. నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..?

cancer kills


Cancer Research : క్యాన్సర్.. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కలవరపెడుతున్న ప్రాణాంతక వ్యాధి. క్యాన్సర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పిల్లవాడి నుంచి 80 ఏళ్లు దాటిన ముసలివాళ్ల వరకూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. క్యాన్సర్‌కు చికిత్స ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొన్ని రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా పలు వైద్య సంస్థలు, శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వీటిలో క్యాన్సర్ వ్యాధి మూలకారణం గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. క్యాన్సర్‌పై సింగపూర్‌కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు.


క్యాన్సర్ పరిశోధనలకు ముందుకు వెళ్లే మార్గంలో.. సింగపూర్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి. అవి తీవ్రమైన మార్పులకు లోనవడానికి, అలానే ప్రాణాంతక కణితులుగా అభివృద్ధి చెందడం వంటి అంశాలను వెలుగులోకి తెచ్చారు.

Read More : బరువు ఈ టైమ్‌లో అసలు చెక్ చేసుకోవద్దు..!

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధిగా మారడానికి ప్రధానంగా న్యూట్రోఫిల్స్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణం కారణమని నిపుణులు వెల్లడించారు. న్యూట్రోఫిల్స్ తెల్ల రక్త కణాల్లో భాగం. ఇది ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్‌కు వ్యతిరేకంగా శరీరానికి మొదటి రక్షణ వలయంగా పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు కణితులు పెరగడానికి ఈ న్యూట్రోఫిల్స్ ప్రత్యక్షంగా కారణం అవుతున్నాయని చెబుతున్నారు.

కణితిలో ఉండే న్యూట్రోఫిల్స్ కణితి పెరుగుదలకు తోడ్పడడంలో కీలక పాత్ర పోషిస్తాయని సింగపూర్ శాస్త్రవేత్తలు తేల్చేశారు. న్యూట్రోఫిల్స్ ఇన్ఫెక్షన్లు సోకకుండా మనశరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థలో భాగం. ప్రాథమికంగా ఇవి ఫాగోసైటోసిస్‌కు బాధ్యత వహిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందకుండా నాశనం చేస్తాయి.

తాజాగా శాస్త్రవేత్తలు ప్రచురించిన సైన్స్ జర్నల్‌ ప్రకారం.. క్యాన్సర్ కణితి పెరిగేందుకు ప్రోత్సహించే కణాల్లో న్యూట్రోఫిల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పరిశోధనల్లో భాగంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రీ-క్లినికల్ మోడల్‌ను ఉపయోగించి న్యూట్రోఫిల్స్ క్యాన్సర్ కణితి లోపల ఎలా మారుతున్నాయి, కొత్త లక్షణాలను ఎలా పొందుతున్నాయి వంటివి తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

Read More :  తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!

అయితే న్యూట్రోఫిల్స్ క్యాన్సర్ కణితి కేంద్రంలో కొత్త రక్తనాళాల నిర్మాణాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఆక్సిజన్ సహా ఇతర పోషకాలను అందించడం ద్వారా కణితి పెరుగుదలను సులభతరం చేస్తాయని రిప్రోగ్రామింగ్ ప్రక్రియను ట్రాక్ చేయడం ద్వారా తేలింది. న్యూట్రోఫిల్-ట్యూమర్ చర్యలను నిరోధించడం ప్యాంక్రియాటిక్ కణితి పెరుగుదలలో గణనీయమైన తగ్గింపు కనిపించిందని శాస్త్రవేత్తలు బృందం వెల్లడించింది.

నిజానికి తెల్ల రక్త కణాలు అనేవి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి. వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను, వైరస్‌ను అంతం చేసేందుకు తెల్ల రక్త కణాలు సహాయపడతాయి. కానీ ఈ తెల్ల రక్త కణాలు క్యాన్సర్ వ్యాధికి కూడా కారణం అవుతున్నాయని, ముఖ్యంగా న్యూట్రోఫిల్స్ అనే తెల్ల రక్త కణాలు ఈ క్యాన్సర్ కణితులు పెరగడానికి ఎక్కువగా తోడ్పడుతున్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే ఈ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

Disclaimer : ఈ కథనాన్ని ఆరోగ్య నిపుణుల సలహాలు , పలు హెల్త్ జర్నల్స్ ఆధారంగా రూపొందించాము.

Tags

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×