BigTV English

Bird Flu : మీ శరీరంలో ఈ మార్పులు ఉంటే.. బర్డ్ ఫ్లూ ఉన్నట్లే..!

Bird Flu : మీ శరీరంలో ఈ మార్పులు ఉంటే.. బర్డ్ ఫ్లూ ఉన్నట్లే..!

bird flu virus


Symptoms Of Bird Flu In Humans : ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించగా బర్డ్ ఫ్లూ‌గా నిర్ధారైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు.. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నందున కోళ్ల వ్యాపారాలపై ఆంక్షలు విధించారు.

కోళ్లు చనిపోయిన ప్రాంతం నుంచి 10 కిలో మీటర్లు చికెన్ షాపులను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ పక్షులకు మాత్రమే కాకుండా ఇతర జంతువులకు, మనుషులకు కూడా వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా కోళ్ల ప్రాణాలు తీస్తుంది. బర్డ్ ఫ్లూ కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందును ప్రజలు సురక్షితంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


Read More : వాటర్ క్యాన్స్‌లో నీరు తాగుతున్నారా..?

బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలలో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దేశీయ కోళ్లకు ఇది సులభంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన కోడి, ఇతర జంతువులు మలం లేదా నోటి, కళ్ల నుంచి వచ్చే స్రావాల ద్వారా వైరస్ మనుషులకు సోకుతుంది. అంతేకాకుండా మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్ వ్యాపిస్తుంది.

బర్డ్ ఫ్లూ సాధారణ ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వైరస్ సోకిన మనుషులు.. దగ్గు,జలుబు, విరేచనాలు, తలనొప్పి, కండరాలనొప్పి, గొంతు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఈ లక్షణాలు ఉంటే బర్డ్ ఫ్లూ బారిన పడినట్లుగా గుర్తించాలి. వీరిని సపరేట్‌గా వేరే గదిలో ఉంచాలి. లేకుంటే ఇది సులభంగా వేరే వ్యక్తులకు సోకుతుంది.

Read More :  మీ ఇంట్లో స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉన్నారా..?

బర్డ్ ఫ్లూ సోకిన వెంటనే వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి. వారి సలహా మేరకు మందులు తీసుకోవాలి. ఈ వైరస్‌ను రక్త పరీక్షలతో సులభంగా నయం చేయవచ్చు. వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించండి. వైరస్ కట్టడి చేయడానికి అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకోండి.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో నివశించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు కోళ్ల పరిశ్రమలో పనిచేస్తుంటే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కోళ్ల ఫారాలకు వెళ్లినప్పుడు చేతులకు, ముఖానికి మాస్క్ ధరించండి.

Disclaimer : ఈ సమాచారాన్ని ఆరోగ్య నిపుణుల సలహాలు , పలు వైద్య పరిశోధనలు ఆధారంగా సేకరించాం.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×