E-Paper
Advertisement

వర్షాకాలంలో ఫుడ్ ఎక్కువ రోజులు పాడవకుండా.. ఉండాలా ? టాప్ 5 ఫ్రిజ్ లిస్ట్

వర్షాకాలంలో ఫుడ్ ఎక్కువ రోజులు పాడవకుండా.. ఉండాలా ? టాప్ 5 ఫ్రిజ్ లిస్ట్
Advertisement

Best Refrigerators For Monsoon: వర్షా కాలంలో.. గాలిలో తేమ పెరగడం వల్ల ఫ్రిజ్‌ ఓపెన్ చేసిన ప్రతి సారీ లోపలికి తడి గాలి చేరి, ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతుంటాయి. ఫ్రిజ్ లోపల బ్యాక్టీరియా, బూజు చేరి చెడు వాసన రావడం ఈ సీజన్ లో పెద్ద తలనొప్పి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? అంటే కచ్చితంగా ఉంది. స్మార్ట్ మాయిశ్చర్ కంట్రోల్,అడ్వాన్స్‌డ్ డీఫ్రాస్టింగ్ టెక్నాలజీతో వస్తున్న 5 బెస్ట్ ఫ్రిజ్‌లు ఈ వర్షాకాలంలో మీ వంటగదికి కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి.

ఇండియన్ మన్సూన్ అంటేనే.. వర్షాలతో పాటు హ్యుమిడిటీని మోసుకొస్తుంది. ఈ టైమ్‌లో ఫ్రిజ్‌ను సరిగ్గా మేనేజ్ చేయకపోతే.. బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ లో హోమ్ అప్లయన్సెస్ కొనేవాళ్లు ఎక్కువగా “మాయిశ్చర్ కంట్రోల్” ఫీచర్స్ కోసమే వెతుకుతున్నారు.  ఆహారాన్ని ఫ్రెష్‌గా ఉంచే టాప్ 5 ఫ్రిజ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.Samsung 253L Curd Maestro Inverter (Twin Cooling Plus):

Advertisement

శాంసంగ్ తెచ్చిన ‘ట్విన్ కూలింగ్ ప్లస్’ టెక్నాలజీ వర్షాకాలానికి పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది ఫ్రిజ్, ఫ్రీజర్ విభాగాలకు విడివిడిగా కూలింగ్ అందిస్తుంది. దీని వల్ల ఫ్రీజర్‌లోని తేమ ఫ్రిజ్‌లోకి రాదు. గాలిలో తేమను బట్టి దీని డిజిటల్ టచ్ ప్యానెల్‌లో ‘మన్సూన్ మోడ్’ సెట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్టీరియా పెరగకుండా. ఆహారాల వాసనలు ఒకదానికొకటి కలవకుండా చూస్తుంది.

2. LG 260L Double-Door Smart Inverter (Door Cooling+):

ఎల్‌జీ కి చెందిన ‘డోర్ కూలింగ్+’ టెక్నాలజీ వర్షాకాలంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఫ్రిజ్ డోర్ తీసినప్పుడు బయట ఉండే తడి గాలి లోపలికి వెళ్తుంది. కానీ ఎల్‌జీ డోర్ వెనుక ఉండే ప్రత్యేక వెంట్స్ నుంచి చల్లటి గాలి బ్లో అయి, బయటి వేడిని, తేమను వెంటనే కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉండి ఆకుకూరలు కుళ్ళిపోకుండా ఉంటాయి.

3. Whirlpool Intellifresh Inverter (6th Sense Intellisensor):

Advertisement

వర్ల్‌పూల్ ఫ్రిజ్‌లు వాటి ‘6th సెన్స్ మాయిశ్చర్ రిటెన్షన్’ టెక్నాలజీకి పేరుగాంచాయి. దీని లోపల ఉండే ఇంటెలిజెంట్ సెన్సార్లు బయట ఉన్న వాతావరణాన్ని, తేమను రీడ్ చేసి.. ఫ్రిజ్ లోపల తేమ ఎక్కువైతే.. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తాయి. దీని గార్డెన్ ఫ్రెష్ క్రిస్పర్ బాక్స్ కూరగాయలలోని అదనపు తడిని పీల్చుకుని, అవి కుళ్ళిపోకుండా దాదాపు 15 రోజుల పాటు తాజాగా ఉంచుతుంది.

4. Haier 256L 3-Star Inverter Double Door:

హైయర్ ఫ్రిజ్‌లలో.. ఉండే ఐట్ (8-ఇన్-1) కన్వర్టిబుల్ మోడ్స్ వర్షాకాలంలో చాలా యూజ్ అవుతాయి. ముఖ్యంగా దీనిలోని ‘యాంటీ-ఫంగల్ గ్యాస్కెట్’డోర్ కి ఉండే రబ్బర్ సీల్ వద్ద వర్షాకాలంలో వచ్చే నల్లటి బూజును, జిడ్డును చేరనివ్వదు. గాలిని నిరంతరం శుద్ధి చేసే ఫిల్టర్లు లోపల బ్యాక్టీరియా చేరకుండా కాపాడతాయి.

Also Read: వర్షాకాలంలో.. స్మార్ట్‌ఫోన్ తడిసినా పాడవకుండా ఉండాలా?

5.Bosch 269L 3-Star Inverter Refrigerator:

జర్మన్ ఇంజనీరింగ్‌తో వచ్చే బాష్ ఫ్రిజ్‌లు క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. వీటిలో ఉండే ‘మల్టీ ఎయిర్‌ఫ్లో’సిస్టమ్ ఫ్రిజ్‌లోని ప్రతి మూలకు సమానంగా గాలిని పంపిస్తుంది. వర్షాకాలంలో ఫ్రిజ్ మూలల్లో.. తేమ పేరుకుపోయి బూజు పట్టే సమస్యకు ఈ ఫీచర్ పక్కా సొల్యూషన్ ఇస్తుంది.

ఈ వర్షాకాలంలో కొత్త ఫ్రిజ్ కొనాలనుకుంటే ఈ 5 బ్రాండ్లలో దేన్నైనా ఎంచుకోవచ్చు. అలాగే ఒక చిన్న టిప్ ఏంటంటే.. ఈ సీజన్‌లో ఫ్రీజర్ టెంపరేచర్‌ను సరిపడా సెట్ చేసి ఉంచితే తేమ సమస్య అస్సలు రాదు.

Related News

కంపెనీ vs లోకల్ మెకానిక్.. ఫ్రిజ్, ఏసీ, టీవీ పాడైతే.. ఎవరితో రిపేర్ చేయిస్తే బెస్ట్?

బడ్జెట్ ధర.. రాకెట్ స్పీడ్ డ్రైయింగ్! ఈ 5 వాషింగ్ మెషీన్లపై ఓ కన్నేయండి!

జాబ్ చేస్తూనే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలా? నెలకు రూ.20,000 వచ్చే.. 5 తేలికైన మార్గాలు ఇవే!

నిమ్మకాయను మైక్రోవేవ్‌లో పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా? పరిశోధనలో వెల్లడైన నిజాలు!

రూ. 999 కే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. బెనిఫిట్స్ కొట్టేయండి!

గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో.. భారీ వర్షంలో ఈ రంగుల అలర్ట్స్ ఎందుకిస్తారు? దీని వెనకున్న లెక్కలేంటి?

చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్.. జియో రూ. 349 vs వీఐ రూ. 449.. ఏది బెస్ట్ అంటే?

Big Stories

Advertisement
×