Best affordable washing machine: బయట చూస్తే ఆగకుండా వర్షాలు.. ఇంట్లో చూస్తే ఆరని బట్టల కుప్పలు! వానాకాలం వస్తే చాలు ప్రతి ఇంట్లోనూ ఇదే పెద్ద తలనొప్పి. వర్షాకాలంలో బట్టలు ఆరక మురికి వాసన రావడం కామన్. మరి ఈ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టాలంటే.. ఓ మంచి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ఉండాల్సిందే. అందుకే.. మీ జేబుకి చిల్లు పడకుండా, కేవలం రూ. 15,000 బడ్జెట్ లోపలే వస్తూ.. వర్షంలోనూ బట్టలను ఇట్టే ఆరబెట్టే 5 అదిరిపోయే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ లిస్ట్ మీకోసం.
వర్షాకాలంలో బట్టలు ఉతకడం ఒక ఎత్తైతే, వాటిని ఆరబెట్టడం హిమాలయ పర్వతం ఎక్కినంత కష్టంగా మారుతుంది. అయితే వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు RPM ఎక్కువగా ఉన్నది చూసుకుంటే.. అది బట్టలను వేగంగా తిప్పుతూ నీటిని పూర్తిగా పిండేస్తుంది. దీని వల్ల ఫ్యాన్ కింద వేసినా బట్టలు త్వరగా ఆరిపోతాయి. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న 5 బెస్ట్ అఫోర్డబుల్ మెషీన్స్ ..
వోల్టాస్ బెకో బ్రాండ్ ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్లో దూసుకుపోతోంది. ఈ 7 Kg మోడల్ చిన్న, మీడియం ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్. ఇందులో ఉండే Monsoon Dry / Fast Dry టెక్నాలజీ వర్షాకాలంలో బట్టలలోని తేమను గాలి ద్వారా చాలావరకు లాగేస్తుంది. 5-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు కూడా తక్కువే వస్తుంది.
ధర: సుమారు రూ.12,000-రూ.13,000.
నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ శామ్‌సంగ్. ఈ మెషీన్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి చాలా సైలెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో Air Turbo Drying System ఉంటుంది. ఇది డ్రమ్ తిరిగేటప్పుడు బయట గాలిని లోపలికి లాక్కుని, బట్టలను వేగంగా ఆరబెడుతుంది. దీనివల్ల వర్షాలు పడుతున్నా బట్టలు త్వరగా డ్రై అవుతాయి. దీని డిజిటల్ ఇన్వర్టర్ మోటార్‌పై ఏకంగా లాంగ్ వారంటీ లభిస్తుంది.
ధర: సుమారు రూ.15,000-రూ.17,000.
ఎల్జీ బ్రాండ్ వాషింగ్ మెషీన్ల విభాగంలో ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఈ స్మార్ట్ ఇన్వర్టర్ మోడల్ తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ ఇస్తోంది. ఇందులో 700 కన్నా ఎక్కువ RPM స్పిన్ స్పీడ్ ఉంటుంది. అంతే కాకుండా దీనిలోని TurboDrum, ఎయిర్ డ్రై ఫంక్షన్ వర్షాకాలంలో బట్టలను చాలా ఎఫెక్టివ్‌గా పిండేస్తాయి. బట్టలు ముడతలు పడకుండా నీట్ గా బయటకు వస్తాయి.
ధర:సుమారు రూ.16,000-రూ.18,000.
విర్ల్‌పూల్ ఎప్పటినుంచో ఇండియన్ ఇళ్లలో ఒక భాగమైపోయింది. దీని రాయల్ సిరీస్ తక్కువ బడ్జెట్ లో సూపర్ సక్సెస్ అయింది. ఈ మెషీన్‌లో Spiro Wash, హై స్పీడ్ డ్రైయర్ ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రై సైకిల్స్ బట్టల దుర్వాసనను దూరం చేస్తాయి. లో-వాటర్ ప్రెషర్ ఉన్నా సరే ఇది ఈజీగా రన్ అవుతుంది.
ధర:సుమారు రూ.14,000-రూ. 15,000
Also Read: వర్షాకాలంలో ఫుడ్ ఎక్కువ రోజులు పాడవకుండా.. ఉండాలా ? టాప్ 5 ఫ్రిజ్ లిస్ట్
స్వదేశీ బ్రాండ్ అయిన గోద్రెజ్ మన అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధరలో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఇందులో Turbo 6 Pulsator, ఎక్కువ RPM కలిగిన మోటార్ ఉంటుంది. దీని వల్ల బట్టలు శుభ్రంగా అవ్వడమే కాకుండా, స్పిన్ మోడ్ లో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూనే ఫాస్ట్ డ్రైయింగ్ ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఇది.
ధర:సుమారు రూ.13,000-రూ.14,000.
ఈ రోజుల్లో కస్టమర్లు కేవలం బ్రాండ్ మాత్రమే కాదు, స్మార్ట్ ఫీచర్స్ , తక్కువ ధరను చూస్తున్నారు. వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే.. ఈ 5 మోడల్స్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అందిస్తాయి. మీ బడ్జెట్, అవసరాలను బట్టి ఇప్పుడే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్లలో ఆఫర్స్ చెక్ చేసి డీల్ లాక్ చేసుకోండి.