E-Paper
Advertisement

రూ. 999 కే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. బెనిఫిట్స్ కొట్టేయండి!

రూ. 999 కే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. బెనిఫిట్స్ కొట్టేయండి!
Advertisement

Samsung Pre-Reservation: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శాంసంగ్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల కోసం భారత మార్కెట్లో ప్రీ-రిజర్వేషన్లను అధికారికంగా ప్రారంభించింది. జూలై 22న జరగబోయే గ్లోబల్ లాంచ్‌కు ముందే ఈ బుకింగ్స్ విండోను ఓపెన్ చేసింది. కాగా ఈసారి శాంం‌సంగ్ ఒకేసారి మూడు ఫోల్డబుల్ ఫోన్లను పరిచయం చేయబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇందులో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 (Galaxy Z Fold 8), గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా (Galaxy Z Fold 8 Ultra), గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 (Galaxy Z Flip 8) మోడళ్లు ఉండే ఛాన్స్ ఉంది.

ప్రీ-రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి?

ఈ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం రూ. 999 టోకెన్ అమౌంట్ చెల్లించి ముందే రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ పూర్తిగా రీఫండబుల్ (తిరిగి ఇచ్చేయబడుతుంది) అని కంపెనీ స్పష్టం చేసింది. ఒకవేళ ప్రీ-రిజర్వ్ చేసుకున్న తర్వాత ఫోన్ కొనుగోలు పూర్తి చేస్తే కస్టమర్లకు రూ. 2,799 విలువైన అదనపు బెనిఫిట్స్ లభించనున్నాయి. ఆసక్తి గలవారు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ (Samsung.com), శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ప్రీ-రిజర్వేషన్లు చేసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పవర్‌ఫుల్ ఏఐ ఫీచర్లు

Advertisement

రాబోయే ఫోల్డబుల్ డివైజ్‌లు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రాబోతున్నట్లు శాంసంగ్ ఇప్పటికే హింట్ ఇచ్చింది. వినియోగదారులకు మరింత పర్సనలైజ్డ్, అడాప్టివ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ ఫోన్లలో ఏఐని జోడించారు. అంతేకాకుండా పాత మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త ఫోన్లను మరింత స్లిమ్ గా (Thinner), తేలికగా (Lighter), బలంగా (Stronger) డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే శాంసంగ్ ఇప్పటివరకు ఈ ఫోన్ల పేర్లను గానీ వాటి పూర్తి స్పెసిఫికేషన్లను గానీ అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం.

జూలై 22న ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్

శాంసంగ్ తన తదుపరి ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌ను లండన్ వేదికగా జూలై 22న నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌ను శాంం‌సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్, శామ్‌సంగ్ న్యూస్‌రూమ్, వారి యూట్యూబ్ ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఈ ఈవెంట్‌లోనే కొత్త ఫోల్డబుల్ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

Advertisement

Also Read: గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో.. భారీ వర్షంలో ఈ రంగుల అలర్ట్స్ ఎందుకిస్తారు? దీని వెనకున్న లెక్కలేంటి?

వాచీలు, స్మార్ట్ గ్లాసెస్ కూడా!

ఈ జూలై 22 ఈవెంట్‌లోనే శాంం‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 (Galaxy Watch 9), గెలాక్సీ వాచ్ ఆల్ట్రా 2 (Galaxy Watch Ultra 2) స్మార్ట్‌వాచ్‌లను కూడా లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా శాంం‌సంగ్ ఎప్పటినుంచో డెవలప్ చేస్తున్న సరికొత్త ‘ఆండ్రాయిడ్ XR స్మార్ట్ గ్లాసెస్’ (Android XR Smart Glasses)ను కూడా ఈ వేదికపై ప్రదర్శించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవి లాంచ్ అయిన వెంటనే కాకుండా కొంచెం ఆలస్యంగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మెుత్తంగా ప్రైమ్ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్లతో రాబోతున్న ఈ డివైజ్‌ల కోసం టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read: ప్రపంచంలోనే తొలిసాలి.. రోబోలతో లైవ్ సర్జరీ.. ఆపరేషన్ సూపర్ సక్సెస్!

Related News

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Big Stories

Advertisement
×