E-Paper
Advertisement

నిమ్మకాయను మైక్రోవేవ్‌లో పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా? పరిశోధనలో వెల్లడైన నిజాలు!

నిమ్మకాయను మైక్రోవేవ్‌లో పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా? పరిశోధనలో వెల్లడైన నిజాలు!
Advertisement

Microwave Lemon: వంటగదిలో నిమ్మరసం పిండడం అనేది రోజూ చూసే పనే. కానీ కొన్నిసార్లు నిమ్మకాయలు గట్టిగా ఉండి, ఎంత పిండినా సరిగ్గా రసం రాదు. అలాంటప్పుడు నిమ్మకాయను కాసేపు మైక్రోవేవ్‌లో ఉంచితే ఎక్కువ రసం వస్తుందనే ఒక చిట్కా సామాజిక మాధ్యమాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. అసలు ఈ చిట్కా వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇది నిజంగానే పనిచేస్తుందా? లేదా? అనే విషయాలను ఆహార నిపుణుల పరిశోధనల ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గట్టిదనానికి కారణం?

సాధారణంగా నిమ్మకాయ లోపల రసం ఉండే చిన్న చిన్న భాగాలను ‘జ్యూస్ వెసికిల్స్’ (Juice Vesicles) అంటారు. ఇవి ‘పెక్టిన్’ అనే పదార్ధంతో కూడిన సన్నని పొరల (మెంబ్రేన్స్) చేత కప్పబడి ఉంటాయి. ఈ పెక్టిన్ నిమ్మకాయకు గట్టిదనాన్ని ఇస్తుంది. నిమ్మకాయలు పూర్తిగా పండనప్పుడు లేదా ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు ఈ పొరలు మరింత గట్టిగా మారి రసాన్ని సులువుగా బయటకు రానివ్వవు. అయితే బ్రిటన్‌కు చెందిన ఆహార శాస్త్ర వేదిక ‘ది సిటీ ఈజ్ అవర్స్’ కథనం ప్రకారం.. మైక్రోవేవ్‌లోని స్వల్ప ఉష్ణోగ్రత ఈ పెక్టిన్ పొరలను మెత్తబరుస్తుంది. దీనివల్ల లోపలి గుజ్జు సాగే గుణాన్ని పొంది తక్కువ శ్రమతోనే ఎక్కువ రసాన్ని ఇస్తుంది.

ప్రయోగాల్లో తేలింది ఇదే!

Advertisement

ఈ పద్ధతి సిద్ధాంతపరంగానే కాకుండా ఆచరణలోనూ రుజువైంది. అమెరికాకు చెందిన ప్రముఖ కుకింగ్ వెబ్‌సైట్ ‘ది కిట్చ్న్’ కోసం ఫుడ్ రైటర్ కెల్లీ ఫోస్టర్ దీనిపై ఒక ప్రయోగం చేశారు. సాధారణ నిమ్మకాయలను.. 10 సెకన్లు, 20 సెకన్లపాటు మైక్రో ఓవెన్ లో పెట్టిన లెమన్స్ తో ఆయన పోల్చారు. 20 సెకన్ల పాటు వేడి చేసిన నిమ్మకాయల నుండి దాదాపు ముప్పావు కప్పు రసం రాగా.. సాధారణ, 10 సెకన్లపాటు వేడి చేసిన వాటి నుంచి 2/3 వంతు కప్పు రసం మాత్రమే వచ్చింది. అంటే 20 సెకన్ల పాటు ఓవేన్ లో వేడి చేస్తే.. రసం పరిమాణం గణనీయంగా పెరుగుతుందని నిరూపితమైంది.

ఈ ప్రాసెస్ చాలా సురక్షితమట!

నిమ్మకాయను వేడి చేసినప్పుడు పైపొరతో పాటు లోపల ఉండే గాలి బుడగలు (ఎయిర్ పాకెట్స్) కూడా మెత్తబడతాయి. ‘ఈక్వినాక్స్’ అనే హెల్త్ సంస్థ 2025లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మైక్రోవేవ్ సహాయంతో రసాన్ని తీయడం వల్ల విటమిన్ సి, నిమ్మకాయ రుచి దెబ్బతినకుండా 10 నుండి 25 శాతం అదనపు రసాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన నేరుగా నిమ్మకాయ పిండి వాడేకంటే మైక్రోఓవెన్ లో పెట్టి రసం తీస్తే.. ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చని అర్థమవుతోంది.

Advertisement

Also Read: రూ. 999 కే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. బెనిఫిట్స్ కొట్టేయండి!

ఈ చిట్కా ఎప్పుడు వాడాలి?

అయితే నిమ్మకాయను ఓవెన్ లో వేడి చేసే అంశంపై నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఎక్కువసేపు వేడి చేస్తే నిమ్మకాయలోని తాజాదనం, సువాసన తగ్గిపోతాయని ఈక్వినాక్స్ ఫుడ్ అండ్ బెవరేజ్ డైరెక్టర్ కాట్జీ గై-హామిల్టన్ పేర్కొన్నారు. అటు ఫ్రిడ్జ్ నుంచి తీసిన చల్లని నిమ్మకాయలకు లేదా బాగా గట్టిగా ఉన్న వాటికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేయనుంది. నిమ్మకాయను కట్ చేయకుండా ఈ చిట్కాలను ఫాలో అయితే ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

Also Read: గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో.. భారీ వర్షంలో ఈ రంగుల అలర్ట్స్ ఎందుకిస్తారు? దీని వెనకున్న లెక్కలేంటి?

Related News

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ధమాకా..HP లాప్‌టాప్స్‌ ఇప్పుడు సగం ధరకే !

మీ ఐఫోన్ మెమరీ ఉన్నట్టుండి ఫుల్ అయిందా? ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేస్తే 14GB మీ సొంతం!

తక్కువ ధరలో..మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా ?

రూ.599 నుంచే వైర్‌లెస్ బడ్స్.. అమెజాన్ సేల్‌లో మిస్ అవ్వకూడని టాప్ డీల్స్!

స్మార్ట్‌ ఫోన్‌నే స్పై కెమెరాగా మార్చే టెక్నాలజీ.. కాల్స్, మెసేజెస్, చివరికి లొకేషన్స్ కూడా లీక్!

ఇంట్లో వ్యాక్యూమ్ రోబోట్ తిరుగుతోందా? హ్యాకర్లు మిమ్మల్ని సైలెంట్‌గా గమనిస్తున్నారు జాగ్రత్త!

గేమర్స్‌కు గుడ్‌న్యూస్..బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లు

Big Stories

Advertisement
×