Side Income Ideas: ఉద్యోగ బాధ్యతలతో పాటు నెలకు అదనంగా రూ. 20,000 వరకు సంపాదించాలనుకునే వారి కోసం ప్రస్తుతం ఎన్నో మార్గాలు బయట అందుబాటులో ఉన్నాయి. తక్కువ శ్రమ, నైపుణ్యమే పెట్టుబడిగా 5 అద్భుతమైన ఆన్ లైన్ సైడ్ ఇన్‌కమ్ ఐడియాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేసి.. మీకు నచ్చిన దానిని పార్ట్ టైమ్ జాబ్ గా ఎంచుకోండి.
పండుగలు, పుట్టినరోజులు, పెళ్లిళ్లకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు పెద్ద ట్రెండ్ గా మారింది. చేతితో చేసిన ఆర్ట్ వర్క్స్, కస్టమైజ్డ్ కీచైన్లు, కప్స్, ఫొటో ఫ్రేమ్‌లు వంటి వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి సృజనాత్మకతను ఉపయోగించి ఇంట్లోనే వీటిని తయారు చేసి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ నెలకు సులువుగా మంచి లాభాలను ఆర్జించవచ్చు.
ఏదైనా సబ్జెక్టుపై పట్టు ఉంటే ఖాళీ సమయాల్లో ఆన్‌లైన్ ట్యూషన్లు చెప్పడం ద్వారా నెలకు సులభంగా సంపాదించవచ్చు. కేవలం స్కూల్ సబ్జెక్టులే కాకుండా సంగీతం, కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, పెయింటింగ్ వంటి నైపుణ్యాలను కూడా నేర్పించవచ్చు. ప్రయాణాల శ్రమ లేకుండా ఇంట్లోనే కూర్చుని రోజుకు గంట లేదా రెండు గంటలు కేటాయిస్తే చాలు.
యూట్యూబ్‌లో ముఖం చూపించకుండానే చారిత్రక కథలు, ఆసక్తికరమైన విషయాలు, వంటలు, టెక్నాలజీ గురించిన సమాచారాన్ని వాయిస్ ఓవర్ లేదా టెక్స్ట్ రూపంలో అందిస్తూ ‘నో-ఫేస్ ఛానల్స్’ నడపవచ్చు. అలాగే రాయడంపై ఆసక్తి ఉంటే ఒక సొంత బ్లాగ్ ప్రారంభించి మంచి కంటెంట్ రాయవచ్చు. గూగుల్ యాడ్‌సెన్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా దీని నుంచి క్రమంగా స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
ప్రస్తుతం డిజిటల్ మీడియా విపరీతంగా వృద్ధి చెందుతోంది. వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పేజీలకు నిరంతరం కంటెంట్ అవసరమవుతోంది. మీకు తెలుగు లేదా ఇంగ్లీషులో ఆకర్షణీయంగా రాసే నైపుణ్యం ఉంటే ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్‌గా లేదా స్క్రిప్ట్ రైటర్‌గా అవకాశాలు దక్కించుకోవచ్చు. ఇంటి నుంచే పార్ట్-టైమ్‌గా చేస్తూ నెలకు వేలల్లో సంపాదించడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: నిమ్మకాయను మైక్రోవేవ్‌లో పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా? పరిశోధనలో వెల్లడైన నిజాలు!
వివిధ వ్యాపార సంస్థలు, బ్రాండ్లు, ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్లను (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్) రోజువారీగా నిర్వహించడానికి సహాయకుల కోసం చూస్తుంటారు. వారి పోస్టులను డిజైన్ చేయడం, కరెక్ట్ టైమ్‌కి షెడ్యూల్ చేయడం వంటి పనులను మీరే పార్ట్-టైమ్‌గా హ్యాండిల్ చేయవచ్చు. దీనికోసం కొన్ని గంటలు కేటాయిస్తే సరిపోతుంది.
Also Read: రూ. 999 కే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. బెనిఫిట్స్ కొట్టేయండి!