E-Paper
Advertisement

చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్.. జియో రూ. 349 vs వీఐ రూ. 449.. ఏది బెస్ట్ అంటే?

చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్.. జియో రూ. 349 vs వీఐ రూ. 449.. ఏది బెస్ట్ అంటే?
Advertisement

Postpaid Plans: టెలికాం రంగంలో పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా పోస్ట్‌పెయిడ్ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు సరికొత్త ప్లాన్లతో పోటీ పడుతుంటాయి. దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియోతో పాటు వోడాఫోన్ ఐడియా (Vi) కూడా యూజర్ల కోసం బడ్జెట్ ధరల్లో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే జియో తీసుకొచ్చిన రూ.349 ప్లాన్, వీఐ అందిస్తున్న రూ.449 ప్లాన్ యూజర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏ ప్లాన్ ఎక్కువ ప్రయోజనాలను ఇస్తోంది? ఏది యూజర్లకు బెస్ట్ ఛాయిస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 349 ప్లాన్ బెనిఫిట్స్

జియో కేవలం రూ. 349 ధరలోనే అత్యంత చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్ లో ఎయిర్ టెల్, వీఐ తెచ్చిన ప్లాన్ల ధర కంటే ఇదే తక్కువ కావడం విశేషం. ఇక ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి. మొత్తం 30GB డేటా అందుబాటులో ఉంటుంది. ఆ పరిమితి దాటితే ప్రతి GBకి రూ. 10 చొప్పున ఛార్జ్ చేస్తారు. అయితే అర్హులైన యూజర్లకు ట్రూలీ అన్‌లిమిటెడ్ 5G డేటా లభించనుండటం విశేషం.

మరికొన్ని అదనపు ప్రయోజనాలు..

Advertisement

ఇక అదనపు ప్రయోజనాల కింద.. జియోటీవీ యాక్సెస్, 3 నెలల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50GB క్లౌడ్ స్టోరేజ్‌తో జియో ఏఐ క్లౌడ్ కూడా ఈ ప్లాన్ లో లభిస్తాయి. వీటి‌తో పాటు దాదాపు రూ. 35,100 విలువైన 18 నెలల ‘గూగుల్ ఏఐ ప్రో’ (Google AI Pro) సబ్‌స్క్రిప్షన్ ను జియో ఉచితంగా అందిస్తోంది. ఇందులో 5000GB (5TB) భారీ క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా వంటి సేవలను సైతం యూజర్లు ఫ్రీగా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ లో యాడ్-ఆన్ ఫ్యామిలీ సిమ్‌లు ఉండవు.

వీఐ రూ. 449 ప్లాన్ సంగతేంటి?

వోడాఫోన్ ఐడియాలో బేసిక్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ. 451 నుండి ప్రారంభమైనప్పటికీ.. జియో రూ. 349 ప్లాన్‌కు పోటీగా రూ. 449 ప్లాన్ నిలుస్తుందని చెప్పవచ్చు. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. అపరిమిత కాలింగ్‌తో పాటు నెల మొత్తానికి 50GB 4G డేటా లభిస్తుంది. రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ నైట్ డేటా వాడుకోవచ్చు. మిగిలిపోయిన డేటాలో 20GB వరకు తర్వాతి నెలకు రోల్‌ఓవర్ అవుతుంది. ఒకవేళ 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంటే అన్‌లిమిటెడ్ 5G సైతం లభిస్తుంది. కానీ ఇది ట్రూలీ అన్‌లిమిటెడ్ కాదు. ప్రతి 28 రోజులకు 300GB డేటా క్యాపింగ్ (పరిమితి) ఉంటుంది. అది కాకుండా నెలకు 3000 SMSలు యూజర్ చేసుకోవచ్చు.

ఏడాదిపాటు ఫ్రీ ఓటీటీ

Advertisement

వీఐ తన ప్రీపెయిడ్ ప్లాన్ కింద మరికొన్ని అదనపు బెనిఫిట్స్ ను యూజర్ కు అందిస్తోంది. 3 నెలల స్పాటిఫై ప్రీమియం, వి గేమ్స్ (Vi Games) ఈ ప్లాన్ లో లభిస్తాయి. అలాగే ఏడాది పాటు జియోహాట్‌స్టార్, 360 రోజుల సోనీలివ్ సబ్ స్క్రిప్షన్లు ఫ్రీగా పొందొచ్చు. అంతే కాకుండా ఒక సంవత్సరం నార్టన్ మొబైల్ సెక్యూరిటీ కవర్ ను కూడా వీఐ ఆఫర్ చేస్తోంది.

Also Read: ప్రపంచంలోనే తొలిసాలి.. రోబోలతో లైవ్ సర్జరీ.. ఆపరేషన్ సూపర్ సక్సెస్!

ఫైనల్గా రెండిట్లో ఏది బెస్ట్?

పైకి చూసేందుకు వోడాఫోన్ ఐడియా (Vi) ఎక్కువ డేటా, ఓటీటీ ఆప్షన్లను ఇస్తున్నట్లు అనిపించినప్పటికీ వాస్తవానికి రిలయన్స్ జియోనే యూజర్లకు బెస్ట్ వాల్యూను అందిస్తోంది. జియో ప్లాన్ ధర పరంగా చాలా చౌకగా ఉండటమే కాకుండా ఎలాంటి పరిమితులు లేని ‘ట్రూలీ అన్‌లిమిటెడ్ 5G డేటా’ను ఇస్తోంది. దీనికి తోడు ఎంతో విలువ గల గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్, 5TB క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రీమియం బెనిఫిట్స్ లభిస్తుండటంతో తక్కువ బడ్జెట్‌లో పోస్ట్‌పెయిడ్ వాడాలనుకునే వారికి జియో రూ. 349 ప్లాన్ సరైన ఎంపికగా చెప్పవచ్చు.

Also Read: Karthika Deepam 2 Serial Today Episode July 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:   గుడిలో కలిసి పూజ చేసిన జ్యోత్స్న , సూరజ్

Related News

రూ.11,000 లోపే 6000mAh బ్యాటరీ ఫోన్.. మార్కెట్‌లోకి బోల్ట్ ఏస్ 5G, బోల్ట్ ఈవో!

ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×