E-Paper
Advertisement

కంపెనీ vs లోకల్ మెకానిక్.. ఫ్రిజ్, ఏసీ, టీవీ పాడైతే.. ఎవరితో రిపేర్ చేయిస్తే బెస్ట్?

కంపెనీ vs లోకల్ మెకానిక్.. ఫ్రిజ్, ఏసీ, టీవీ పాడైతే.. ఎవరితో రిపేర్ చేయిస్తే బెస్ట్?
Advertisement

Home Appliance Repair: ఇంట్లో ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ వంటి గృహోపకరణాలు (Home Appliances) హఠాత్తుగా చెడిపోతే వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వెంటనే వాటిని బాగు చేయించడానికి సాధారణంగా మనముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి సదరు కంపెనీ అధికారిక టెక్నీషియన్‌ను పిలవడం, రెండోది ఇంటికి దగ్గరలో ఉండే లోకల్ మెకానిక్‌ను సంప్రదించడం. అయితే ఈ రెండింటిలో ఎవరితో రిపేర్ చేయించుకుంటే ఎలాంటి లాభాలు? నష్టాలు? ఉంటాయో ఈ కథనంలో పరిశీలిద్దాం.

కంపెనీ టెక్నీషియన్

రిపేర్ వచ్చిన వస్తువులు వారంటీ పీరియడ్ లో ఉంటే.. కళ్లుమూసుకొని కంపెనీ టెక్నీషియన్‌ను సంప్రదించవచ్చు. ఎందుకంటే వారంటీ సమయంలో ఉచితంగా లేదంటే చాలా తక్కువ ధరకే రిపేర్ పూర్తవుతుంది. పైగా కంపెనీ టెక్నీషియన్లు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ నే ఉపయోగిస్తారు. దీని వల్ల వస్తువు మన్నిక మరింత పెరుగుతుంది. అంతేకాకుండా కంపెనీ టెక్నీషియన్లు ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారు. ప్రొడక్ట్ లోని సమస్యను వేగంగా గుర్తించి.. వారు ఈజీగా పరిష్కరించేస్తారు. అయితే కంపెనీ సర్వీస్ ఛార్జీలు, విడిభాగాల ధరలు లోకల్ మార్కెట్ కంటే చాలా ఎక్కువ ఉండటం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి వీరు రావడానికి 2-3 రోజులు సమయం పట్టడం కూడా ఒక లోపంగా చెప్పవచ్చు.

లోకల్ మెకానిక్ సంగతేంటి?

Advertisement

లోకల్ మెకానిక్స్ అవసరానికి అందుబాటులో ఉంటూ.. తక్కువ ఖర్చులోనే రిపేర్ చేసేస్తుంటారు. మనం ఫోన్ చేయగానే గంటల వ్యవధిలోనే ఇంటికి వచ్చి వస్తువును పరిశీలిస్తారు. అత్యవసర సమయాల్లో ఇది బాగా ప్లస్ అవుతుంది. పైగా కంపెనీలతో పోలిస్తే వీరి సర్వీస్ ఛార్జీలు చాలా తక్కువ. అలాగే తక్కువ ధరలో దొరికే విడిభాగాలను కూడా వీరు ఎంతో నైపుణ్యంతో ఫిక్స్ చేసేస్తారు. ఇక లోపాల విషయానికి వస్తే.. వీరు వాడే స్పేర్ పార్ట్స్ పై గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు నకిలీ పార్ట్స్ వేస్తే వస్తువు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అత్యాధునిక స్మార్ట్ ఏసీలు, టీవీల గురించి లోకల్ మెకానిక్స్ ఏమాత్రం అవగాహన ఉండకపోవడం కూడా మైనస్ గా చెప్పవచ్చు.

Also Read: జాబ్ చేస్తూనే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలా? నెలకు రూ.20,000 వచ్చే.. 5 తేలికైన మార్గాలు ఇవే!

ఇద్దరిలో ఎవరు బెస్ట్?

Advertisement

హోమ్ అప్లయన్స్ కొత్తదైనా, వారంటీలో ఉన్నా, ఖరీదైనదైనా కంపెనీ టెక్నీషియన్‌ చేత రిపేర్ చేయించుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా వారంటీ అయిపోయిన పాత వస్తువులు, చిన్నపాటి రిపేర్లు ఉంటే లోకల్ మెకానిక్‌తో తక్కువ ఖర్చులోనే పని కానిచ్చేయవచ్చని హితవు పలుకుతున్నారు. వస్తువు విలువ, బడ్జెట్‌ను ఏది సరైనదో సొంతంగా నిర్ణయింకోవాలని స్పష్టం చేస్తున్నారు.

Also Read: రూ. 999 కే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. బెనిఫిట్స్ కొట్టేయండి!

Related News

ఆ రాత్రి హాస్టల్ రూమ్‌లో జరిగిన ఆ చిన్న తప్పు.. ప్రపంచాన్ని ఏలే Googleగా ఎలా అవతరించింది?

ఈ రక్షా బంధన్‌కు కజిన్స్‌ను ఇంప్రెస్ చేసే 5 యూనిక్ టెక్ గిఫ్ట్స్.. బడ్జెట్ ధరలోనే!

బడ్జెట్ యూజర్లకు పండగే పండగ.. రూ.10 వేలలోపు మూడేళ్ల వారంటీతో Realme C100i వస్తోంది!

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

రూ.499కే పిల్లల కోసం కిరాక్ గ్యాడ్జెట్.. పోర్ట్రానిక్స్ సరికొత్త రఫ్ ప్యాడ్స్ ఫీచర్లివే!

64% పవర్ సేవింగ్ టెక్నాలజీతో షియోమీ కొత్త డివైజ్‌లు.. భారత్‌లోకి ఎప్పుడంటే?

ఇంత తక్కువ ధరకి 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరానా? Lava Virat V1 Pro 5G వచ్చేసిందోచ్!

Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

Big Stories

Advertisement
×