కొంతమంది ఇతరులు గమనించని చిన్న విషయాలను కూడా సులభంగా గుర్తిస్తారు. ఎదుటివారి ముఖ కవళికలు, మాట తీరు, ప్రవర్తనను చూసి పరిస్థితిని అంచనా వేస్తారు. న్యూమరాలజీ ప్రకారం 4, 7 మూలాంకం ఉన్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వీరిని సరదాగా రియల్ లైఫ్ డిటెక్టివ్‌లు అని పిలుస్తారు.
న్యూమరాలజీ ప్రకారం 4, 7 మూల అంకం ఉన్నవారు విశ్లేషణాత్మకంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా వెంటనే నమ్మరు. ముందుగా అన్ని కోణాల్లో పరిశీలించి, తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. ఈ అలవాటు వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుందని నమ్ముతారు.
ఈ మూల అంకం ఉన్నవారు ఎదుటివారి ముఖ భావాలు, స్వరంలో మార్పులు, బాడీ లాంగ్వేజ్‌ను చాలా జాగ్రత్తగా గమనిస్తారు. మాటలకు, పనులకు మధ్య తేడా ఉంటే వెంటనే గుర్తిస్తారు. అందువల్ల పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది.
ఈ లక్షణాల వల్ల స్నేహితులు వీరిని జేమ్స్ బాండ్ లేదా డిటెక్టివ్‌లతో పోలుస్తుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది.
4, 7 మూల అంకం ఉన్నవారు ఎవరికైనా వెంటనే నమ్మకం పెట్టుకోరు. ముందుగా వారి ప్రవర్తనను గమనిస్తారు. నిజాయితీ, స్థిరమైన ప్రవర్తన కనిపించిన తర్వాత మాత్రమే విశ్వసిస్తారు.
కొంతమందికి ఈ అలవాటు అనుమాన స్వభావంగా అనిపించవచ్చు. కానీ న్యూమరాలజీ ప్రకారం ఇది జాగ్రత్తగా ఆలోచించే లక్షణం మాత్రమే.
ఏ నెలలో 4, 13, 22 తేదీల్లో జన్మించిన వారి మూల అంకం 4. అలాగే 7, 16, 25 తేదీల్లో పుట్టినవారి మూల అంకం 7 అవుతుంది.
ఎవరైనా మాటలు మార్చినా లేదా వివరాల్లో తేడా ఉన్నా వీరు వెంటనే గుర్తిస్తారు. పూర్తి విషయాన్ని తెలుసుకోవడానికి అదనపు ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల సమస్యలను పరిష్కరించడంలో కూడా వీరు మంచి సామర్థ్యం చూపుతారు.
ఈ మూలాంకం ఉన్నవారు ఫలితాన్ని మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా తెలుసుకోవాలని కోరుకుంటారు. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరి ప్రత్యేకత. ఈ అలవాటు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
Also Read: మనసంతా నువ్వే.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి ప్రేమించే భర్త పొందుతారు
ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషించడం వల్ల కొన్నిసార్లు వీరు అవసరానికి మించి ఆలోచిస్తారు. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువసేపు ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతారు. ఈ అలవాటు వ్యక్తిగత సంబంధాల్లో అపార్థాలకు కూడా కారణమవుతుంది. అందుకే తర్కంతో పాటు నమ్మకాన్ని కూడా సమతుల్యంగా ఉంచుకోవడం అవసరం.
Also Read: ప అక్షరంతో మొదలయ్యే పేరు గల అమ్మాయిలు చాలా స్పెషల్.. అందరి దృష్టిని ఆకర్షించే ఈ గుణాలు వీరి సొంతం
గమనిక: ఈ వివరాలు సాంప్రదాయ న్యూమరాలజీ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. బిగ్ టీవి వీటికి బాధ్యత వహించదు. ఒక వ్యక్తి స్వభావాన్ని కేవలం మూల అంకం మాత్రమే నిర్ణయించదు.