E-Paper
Advertisement

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. స్త్రీలను పతనం వైపు నెట్టే 5 అలవాట్లు ఇవే !

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. స్త్రీలను పతనం వైపు నెట్టే 5 అలవాట్లు ఇవే !
Advertisement

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో.. మానవ జీవితంలోని వివిధ కోణాల గురించి.. ముఖ్యంగా స్త్రీ-పురుషుల స్వభావాల గురించి వివరించారు. ఆయన దృష్టిలో.. స్త్రీలలో పుట్టుకతోనే లేదా స్వభావ సిద్ధంగానే కొన్ని లక్షణాలు ఉంటాయని, అవి కొన్ని సందర్భాలలో చెడు అలవాట్లుగా మారతాయని పేర్కొన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతిలోభితా|
అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోషా: స్వభావజా:
ఈ శ్లోకం ప్రకారం.. స్త్రీలలో పుట్టుకతోనే లేదా వారి స్వభావంలో ఉండే 5 ప్రధాన లక్షణాలు లేదా ‘దోషాలు’ఉన్నాయి.

Advertisement

1. అతి సాహసం: స్త్రీలలో అతి సాహసం అనేది ఆలోచించకుండా.. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం లేదా ప్రమాదకరమైన పనులు చేయడం. ఈ లక్షణం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు లేదా కుటుంబానికి ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. మాటల్లో.. చేతల్లో తగినంత ఆలోచన లేకుండా ప్రవర్తించడం కుటుంబ శాంతికి భంగం కలిగిస్తుంది.

2. మోసపూరిత స్వభావం: చాణక్యుడు స్త్రీలలో మోసం చేసే గుణం పుట్టుకతోనే ఉంటుందని పేర్కొన్నాడు. వారు తమ పనులను సాధించుకోవడానికి.. లేదా సమస్యల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కపటత్వాన్ని
ఉపయోగిస్తారని అంటాడు. ఈ లక్షణం కుటుంబంలో విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

Advertisement

3. ఆలోచించకుండా పనిచేయడం: ‘మూర్ఖత్వం’ అంటే ఇక్కడ కేవలం తెలివి తక్కువతనం అని అర్థం కాదు. ఒక పని చేసే ముందు దాని పర్యవసానాల గురించి లేదా దాని ఫలితాల గురించి సరిగ్గా ఆలోచించకపోవడం. తొందరపాటుతో పనులు చేయడం వల్ల భర్తకు, కుటుంబానికి పెద్ద సమస్యలు లేదా కష్టాలు రావచ్చని చాణక్యుడు సూచించాడు.

4. మితిమీరిన అత్యాశ: చాణక్యుడు స్త్రీలకు బంగారం వజ్రాలు, ఖరీదైన వస్తువులు లేదా డబ్బుపై పురుషుల కంటే ఎక్కువ అత్యాశ ఉంటుందని తెలిపాడు. ఈ మితిమీరిన అత్యాశ వల్ల కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగి, ఇంట్లో అశాంతి, గొడవలు మొదలవుతాయని కూడా హెచ్చరించారు.

Also Read: ఈ 4 చెడు అలవాట్లే మీ ఎదుగుదలకు అడ్డంకి.. వెంటనే మార్చేసుకోండి !

5. అపవిత్రత : కొన్ని వివరణల ప్రకారం.. ఈ లక్షణం శారీరక పరిశుభ్రత లేదా కొన్ని శుచి నియమాలను పాటించకపోవడాన్ని సూచిస్తుంది. ఇది కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్దయత్వం అనేది ఇతరుల పట్ల, ముఖ్యంగా బలహీనుల పట్ల లేదా కష్టాల్లో ఉన్న భర్త పట్ల దయ లేకుండా కఠినంగా ప్రవర్తించడం. ఇలాంటి లక్షణాలు ఇంట్లో సుఖ సంతోషాలను దూరం చేస్తాయి.

చాణక్యుడి.. ఈ అభిప్రాయాలు ఆయన జీవించిన కాలంలోని సామాజిక, నైతిక దృక్పథాల నుంచి వచ్చాయని గుర్తించాలి. ఆధునిక సమాజంలో.. ఈ లక్షణాలను మగవారికి లేదా ఆడవారికి ఆపాదించకుండా, కేవలం వ్యక్తిత్వ దోషాలుగా పరిగణించడం జరుగుతోంది. అయితే.. నీతిశాస్త్రంలో ప్రస్తావించిన ఈ అంశాలను చారిత్రక కోణంలో అర్థం చేసుకోవడం ముఖ్యం.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×