Akhanda 2 Remuneration : అఖండ రుద్ర సికందర్ అఘోర తాండవానికి మరో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. పెయిడ్ ప్రీమియర్స ద్వారా ఈ సినిమా ఒక్క రోజు ముందుగానే, డిసెంబర్ 4న సాయంత్రం థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమాలో నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. దీని ప్రకారం.. ఈ సినిమాకు బాలయ్య కంటే బోయపాటి శ్రీనుకే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కినట్టు తెలుస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు అఖండ 2 తాండవం అనే సినిమా చేస్తున్నారు బాలయ్య – బోయపాటి. ఈ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. సీక్వెల్ మూవీ కాబట్టి అంచానలు హై రేంజ్‌లో ఉన్నాయి. దీనికి తోడు సినిమాపై 200 కోట్ల బడ్జెట్‌ను కూడా పెడుతున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ సినిమాకు బాలయ్య కంటే బోయపాటి శ్రీనుకే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.
బాలయ్య ఈ అఖండ 2 సినిమాకు 25 నుంచి 30 కోట్ల వరకు తీసుకున్నాడంట. అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. అయితే, మొత్తంగా మాత్రం బాలయ్య కంటే బోయపాటికే ఎక్కువ అమౌంట్ చేతికి వచ్చిందని సమాచారం. బాలయ్య ఎందుకు తక్కువ తీసుకున్నాడంటే.. ఈ సినిమా లాభాల్లో వచ్చే షేర్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. పైగా ఈ సినిమాను బాలయ్య కూతరు తేజస్వీ ప్రజెంట్ చేస్తున్నారు.
తీసుకున్న రెమ్యూనరేషన్, సినిమాపై పెట్టిన బడ్జెట్ రిటర్న్ రావాలంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో కష్టమే అని తెలుస్తుంది. అఖండ 2 సినిమాకు వరల్డ్ వైడ్ 116 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. అంటే.. ఈ సినిమాకు 117 కోట్ల నెట్ కలెక్షన్లు రావాలంటే. గ్రాస్ లెక్కల్లో అంటే 250 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తేనే సినిమా సేఫ్ సైడ్ ఉంటుంది.
మరి ఇప్పుడు ఆంధ్రలో చాలా ఏరియాల్లో వర్షం ఎఫెక్ట్ ఉంది. దీనికి తోడు ఇటు తెలంగాణలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి ప్రభావం అఖండ 2 మూవీపై స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది. పైగా.. ఇప్పటి వరకు అయితే సినిమాపై బజ్ పెద్దగా ఏం కనిపించడం లేదు. మరి కొన్ని గంటల్లో బాలయ్య సినిమా అందులోనూ.. అఖండ 2 వస్తుంది అంటే.. ఎక్కడా కూడా హడావిడి కనిపించడం లేదు.
వీటిని ఎదుర్కొని అఖండ 2 సేఫ్ జోన్‌లోకి వస్తుందో రాదో చూడాలి.