Raisins Soaked Milk: పాలు, ఎండుద్రాక్ష ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన కలయిక. ఇది మన సంప్రదాయ ఆయుర్వేదంలో అనాదిగా వాడుకలో ఉంది. ఎండుద్రాక్షను రాత్రంతా పాలలో.. నాన బెట్టడం వల్ల అందులోని పోషకాలు సులభంగా జీర్ణమై, శరీరానికి శోషించబడతాయి. ముఖ్యంగా ఉదయం పూట ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ప్రోటీన్, కాల్షియం, ఐరన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, ఎండుద్రాక్ష కలిపి తినడం వల్ల కలిగే అద్భుతమైన 10 ఆరోగ్య ప్రయోజనాలు:
మెరుగైన జీర్ణక్రియ: ఎండుద్రాక్షలో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. ఇది సహజ మందులా పనిచేస్తుంది. పాలలో ఎండుద్రాక్ష నానబెట్టినప్పుడు.. ఇది పేగు కదలికలను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది.
రక్తహీనత నివారణ: ఎండుద్రాక్షలో ఐరన్ , విటమిన్-బి కాంప్లెక్స్, కాపర్ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకం. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి.. రక్తహీనత సమస్య తగ్గుతుంది.
ఎముకలు, దంతాలకు బలం: పాలు కాల్షియంకు ప్రధాన వనరు కాగా.. ఎండుద్రాక్షలో ఉండే ‘బోరాన్’ అనే ఖనిజం శరీరంలో కాల్షియం శోషణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ కలయిక ఎముకల సాంద్రతను పెంచి.. పళ్లను బలంగా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యం మేలు: ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయ పడతాయి. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీంతో పాటు పాలలోని పోషకాలు గుండె కండరాల పనితీరును బలోపేతం చేస్తాయి.
చర్మ కాంతి, యవ్వనం: ఎండుద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా కాపాడతాయి. పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా.. తేమగా ఉంచి, లోపలి నుంచి సహజమైన మెరుపును అందిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపు: ఈ మిశ్రమం విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, జ్వరం వంటి కాలాను గుణ అంటువ్యాధులను ఎదుర్కోవడానికి సహాయ పడుతుంది.
Also Read: ఆరెంజ్ కంటే.. ఎక్కువ విటమిన్ సి ఉన్న పవర్ ఫుడ్స్ ఇవే !
బరువు నియంత్రణలో సహాయం: ఎండుద్రాక్ష సహజమైన తీపిని అందిస్తుంది. పాలలోని ప్రోటీన్ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది. దీని వల్ల అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గి.. ఆరోగ్యకరమైన బరువు అదుపులో ఉంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
శక్తినిస్తుంది : ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఉదయం దీనిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా చురుకుగా.. ఉత్సాహంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.
రక్త శుద్ధి: ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం, మెగ్నీషియం శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గించి, టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయ పడతాయి. రక్తం శుద్ధి అవ్వడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు తగ్గుతాయి.