Ind vs Aus: అప్పుడప్పుడు క్రికెటర్లు చేసే విచిత్రమైన పనులు ఫ్యాన్స్ కి చాలా క్రేజీగా అనిపిస్తాయి. సరిగ్గా ఇలాగే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ పర్యటనలో భాగంగా టీమిండియా క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ముగిసింది. ఇక టి-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. అయితే వన్డే సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డేలలో ఓడిపోయిన అనంతరం భారత ఆటగాళ్లు చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. చివరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న సమయంలో భారత ఆటగాళ్లు ప్రైవేట్ టాక్సీలో షికారుకి వెళ్లారు. వాళ్లే స్వయంగా ఉబర్ బుక్ చేసుకుని మరి షికార్ కి వెళ్ళారు. అయితే ఏ ఏ క్రికెటర్ ఈ షికారుకి వెళ్లారు..? ఎక్కడికి వెళ్లారు..? అనే వివరాల్లోకి వెళితే..
క్యాబ్ ఎక్కిన యువ ఆటగాళ్లు:
భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ప్రసిద్ద్ కృష్ణ, దృవ్ జురెల్ సాధారణ క్యాబ్ రైడ్ కి వెళ్లి.. ఆ ఉబర్ డ్రైవర్ ని ఆశ్చర్యానికి గురి చేశారు. అడిలైడ్ లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఉబర్ డ్రైవర్ తన పికప్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వాహనంలోకి అడుగుపెట్టిన వారు భారత క్రికెటర్లు అని తెలుసుకున్న క్షణంలోనే.. ఆ ఉబర్ డ్రైవర్ ముఖంలో కనిపించిన ఆశ్చర్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
కారులోని డాష్ క్యామ్ లో రికార్డ్ అయిన ఈ వీడియోలో ప్రసిద్ద్ కృష్ణ డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు. ఇక వెనక సీట్లలో యశస్వి జైష్వాల్, జురెల్ కూర్చున్నారు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మొదట వీరిని గుర్తుపట్టలేదు. కానీ ఆ తరువాత వీరు టీమిండియా క్రికెటర్స్ అని తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఈ యువ క్రికెటర్లు ఎక్కడికి వెళ్లారు..? అనే విషయం మాత్రం తెలియ రాలేదు. సరదాగా సిటీలో తిరుగుతూ ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్లి ఉంటారని సమాచారం. ఇక ఈ ముగ్గురు ఆటగాళ్లు గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కలిసి ఆడినవాళ్లే.
Also Read: Shreyas Iyer ICU: డేంజర్‌లో శ్రేయాస్ అయ్యర్… అసలు గాయం ఎక్కడ అయిందంటే
వన్డే ఓటమికి భారత్ బదులు తీర్చుకుంటుందా..?
భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టి-20 సిరీస్ పై పడింది. ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ అక్టోబర్ 29 నుండి నవంబర్ 8 వరకు జరగబోతోంది. ఈ సిరీస్ కోసం భారత టి-20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, మిగిలిన ఆటగాళ్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ టి-20 మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ ఐదు టి-20 ల సిరీస్ లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశం లభించింది. ఇక జట్టులో కీలకమైన ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఈ సిరీస్ కి అందుబాటులోకి వచ్చాడు. ఈ టి-20 సిరీస్ లో భారత్ విజయం సాధించి.. వన్డే సిరీస్ లో ఓటమికి బదులు తీర్చుకుంటుందా..? అనేది వేచి చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">