SIR: దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫేజ్ 1 ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్ఐఆర్) ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. బీహార్ లో నిర్వహించిన ఈ ప్రక్రియ విజయవంతమైందని పేర్కొన్నారు. ఫేక్ ఓట్లనే నిర్మూలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బీహార్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ కు ఎవరూ అభ్యంతరాలు తెలపలేదని.. బీహార్ లో ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తైందని అన్నారు. బీహార్ తొలి విడత పోలింగ్ తర్వాత 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తామని తెలిపారు.
ALSO READ: Kalvakuntla Kavitha: కవిత ఒంటరి పోరు
రాజకీయ పార్టీలకు ఎస్ఐఆర్ పై అవగాహన కలిగిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్లి ఓటరును నిర్దారిస్తామన్నారు. చివరి SIR 21 సంవత్సరాల క్రితం 1951 – 2004 మధ్య 8 సార్లు ఎస్ఐఆర్ నిర్వహించారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సంవత్సరాల్లో తరచుగా వలసలు, డబుల్ ఓటరు ఐడి కార్డులు, చనిపోయిన ఓటర్లను తొలగించకపోవడం, విదేశీయులను తప్పుగా చేర్చడం వంటివి జరిగాయని ఆయన అన్నారు.
2003 ఓటరు జాబితాకు సరిపోలిన వారు లేదా వారి తల్లిదండ్రులు పోస్ట్-ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో చేర్చడానికి ఇతర పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ చేయించుకునే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ఈరోజు (అక్టోబర్ 27) అర్ధరాత్రి నుండి నిలిపివేయబడుతుందని తెలిపారు. ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన ప్రతి ఓటరు ప్రత్యేకమైన ఎన్యూమరేట్ ఫారమ్‌లను EROలు ముద్రిస్తారని ఆయన తెలిపారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఎన్యుమరేషన్ చేపడతామని, డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల చేస్తామన్నారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 8,2026 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 7, 2026న తుది జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు.
ఫేజ్ 2లో ఎస్ఐఆర్ నిర్వహించనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలివే:
అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ..
ALSO READ: Private Bus: జనం ప్రాణాలతో.. ప్రైవేట్ ట్రావెల్స్ ఆటలు !