Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటేనే సినిమా సూపర్ హిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా జక్కన్న దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక త్వరలోనే రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో ప్రభాస్(Prabhas), రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటించిన బాహుబలి(Bahubali) సినిమా రెండు భాగాలు తిరిగి బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) పేరిట ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. తాజాగా రానా ప్రభాస్ రాజమౌళి కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాహుబలి సినిమాలోని కొన్ని సన్నివేశాలు గురించి ఈ ముగ్గురు మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక బాహుబలి సినిమా అంటేనే అందరికీ కట్టప్ప బాహుబలిని చంపడం సన్నివేశమే టక్కున గుర్తుకు వస్తుంది. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ పది సంవత్సరాలు అవుతుంది కదా బాహుబలి విడుదల అయ్యి మీకు ఎలా అనిపిస్తోంది అంటూ రాజమౌళిని అడగడంతో రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశం నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందని తెలిపారు.
కట్టప్ప బాహుబలిని ఎప్పుడు చంపాడు అనేది కాదు అతను బాహుబలిని చంపటానికి సిద్ధపడే సన్నివేశం నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందని తెలిపారు. అనంతరం విగ్రహాన్ని నిలబేట్టే సమయంలో నా చేతులు వణికిపోయాయని ప్రభాస్ మాట్లాడారు. ఇక ఈ ప్రోమో వీడియోలో అనుష్క మాహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అవడం గురించి, బాహుబలి చనిపోయేటప్పుడు అమ్మ జాగ్రత్త అంటూ కట్టప్పకు చెప్పడం వంటి సన్నివేశాల గురించి మాట్లాడారు. అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే బాహుబలి ది ఎపిక్ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది.
The reunion we've all been waiting for ❤️https://t.co/SdR0HOUXQc @ssrajamouli, #Prabhas and @RanaDaggubati come together to talk about #BaahubaliTheEpic and much beyond!
Out very soon! Stay tuned. 😉#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/57ueklNXJa
— Baahubali (@BaahubaliMovie) October 27, 2025
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడంతో భారీ స్థాయిలో టికెట్లు కూడా అమ్ముడుబోతున్నాయి. ఇలా రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయాన్ని వెల్లడించడంతో ప్రేక్షకులలో కూడా ఈ సినిమా చూడాలనే ఉత్సాహం నెలకొంది. అయితే ఈ రెండు సినిమాలలో ఎమోషన్స్ ఎక్కడ మిస్ కాకుండా కొన్ని సన్నివేశాలను తొలగిస్తూ మరికొన్ని అదనపు సన్నివేశాలను కూడా ఈ సినిమాలో చేర్చినట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇలా దాదాపు పది సంవత్సరాల తరువాత మరోసారి బిగ్ స్క్రీన్ పై బాహుబలి రాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. మరి రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Dhanya Balakrishna: రొమాన్స్ చేస్తేనే సక్సెస్.. అందుకే సక్సెస్ కాలేదన్న నటి?