BigTV English

Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా? అయితే ఈ రోగాలకు సిగ్నల్ జాగ్రత్త..!

Bleeding Gums: చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా? అయితే ఈ రోగాలకు సిగ్నల్ జాగ్రత్త..!

Bleeding Gums: బ్రష్ చేసేటప్పుడు లేదా పుకిలించినప్పుడు, ఇతర సందర్భాల్లో చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుండటం చాలా మందిలో చూస్తాం. కానీ, ఎక్కువ మందికి ఇలా చిగుళ్ల నుంచి బ్లడ్ ఎందుకు వస్తుందో తెలియదు. మీకూ ఇలాంటి సమస్య ఎదురవుతుందా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అసలు, చిగుళ్ల నుంచి రక్తం రావడానికి కారణాలేంటి? ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.


చిగుళ్లలో రక్తం రావడానికి కారణాలు
చిగుళ్ల వాపు, ఇది సాధారణంగా పళ్లపై పేరుకున్న ప్లాక్ (Plaque) మరియు టార్టార్ (Tartar) వల్ల వస్తుంది. చిగుళ్లు ఎరుపు, వాపు, బ్రష్ చేసేటప్పుడు లేదా ఫ్లాస్ చేసేటప్పుడు రక్తస్రావం అవుతుంది. అలాగే సరైన దంత శుభ్రత లేకపోవడం, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల కూడా వస్తుంది.

చిగుళ్ల నుంచి రక్తం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అందులో ముఖ్యంగా దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల క్రమంగా పళ్ల మీద గార ఏర్పడి గట్టిగా తయారై, సున్నితమైన చిగుళ్లకు హాని కలిగిస్తాయి. తద్వారా రక్తస్రావానికి కారణం అవుతుందంటున్నారు.


అదేవిధంగా.. చిగుళ్లకు ఇన్ఫెక్షన్ సోకి దీర్ఘకాలం కొనసాగినట్లయితే చిగుళ్లు, వాటికి ఆధారం ఇచ్చే దవడ ఎముకలు కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది. దీన్ని జింజువైటిస్ అంటారు. ఈ ప్రాబ్లమ్ ఉన్నవారికి బ్రష్ చేసుకునే సమయంలో రక్తస్రావం కావొచ్చంటున్నారు. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండటాన్ని ఫిరియాడోంటల్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి కారణంగా చిగుళ్లలో పుండ్లు ఏర్పడతాయి, దంతాలు దూరంగా జరుగుతాయి. బ్రష్ చేసుకున్నప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం కారుతుందని చెబుతున్నారు నిపుణులు.

అలాగే.. పొగతాగే అలవాటున్న వారికి చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. 2018లో ‘జర్నల్ ఆఫ్ పెరియోడాంటాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. స్మోకింగ్‌ చేసే వారిలో చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ రీసెర్చ్​లో స్పెయిన్‌లోని యూనివర్సిటాడ్ కంప్లూటెన్స్ డి మాడ్రిడ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెరియోడాంటాలజీలో ప్రొఫెసర్ ‘డాక్టర్ మిగుయెల్ ఆంజెల్ స్లావిన్స్కీ’ పాల్గొన్నారు.

Also Read: జామకాయ మంచిదని తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు గ్యారంటీ

వీటితో పాటు మధుమేహం, విటమిన్ కె లోపం, గర్భధారణ సమయంలో హార్మోనల్ మార్పులు, లుకేమియా, ఒత్తిడి, హెచ్ఐవి/ఎయిడ్స్ వంటివి కూడా చిగుళ్లలో రక్తస్రావం కావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, మీ చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నట్టయితే.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన ట్రీట్​మెంట్ తీసుకోవడం మంచిదంటున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ముఖ్యంగా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి.
హార్డ్ బ్రష్​కు బదులుగా సాఫ్ట్ బ్రష్ ను యూజ్ చేయాలి. అదేవిధంగా సరైన టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవాలి.
అలాగే.. దంతాల మధ్య నుంచి ఫలకాన్ని తొలగించడానికి క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేసుకోవాలి.
దంతాలకు బలం చేకూర్చే సమతుల ఆహారం తీసుకోవాలి. అన్నింటికంటే ప్రధానంగా సిగరెట్, పొగాకు వంటి అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి.
చెక్-అప్, ప్రొఫెషనల్ క్లీనింగ్ కోసం దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించడం చేస్తుండాలి. వీటిని క్రమం తప్పకుండా ఫాలో అవ్వడం ద్వారా చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగకుండా చూసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×