BigTV English

Producer Chitturi Srinivas: ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం

Producer Chitturi Srinivas: ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం

Producer Srinivas Chitturi Brother Kashi Vishwanath Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత చిట్టూరు శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు చిట్టూరు కాశీ విశ్వనాథ్ (49) మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 15న ఉదయం ఆయన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


కాగా ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఆయన మరణవార్త మరువక ముందే మరో సీనియర్ నటి సరోజా దేవి కూడా అనారోగ్యంతో మరణించారు. తాజాగా నిర్మాత శ్రీనివాస్ సోదరుడు మరణించడంతో టాలీవుడ్ మరోసారి విషాద ఛాయాలు అలుముకున్నాయి.

రామ్, చైలతో తమిళ్ సినిమా..


నిర్మాతగా చిట్టూరు శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఆయన హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. తెలుగులోనే కాదు ఇతర భాష దర్శకులతోనూ ఆయన పని చేస్తుంటారు. గతంలో ఆయన బ్యాక్ టూ బ్యాక్ తమిళ దర్శకులతో మన తెలుగు హీరోలతో సినిమాలు చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. రామ్ పోతినేని ది వారియర్, అక్కినేని హీరో నాగ చైతన్యల కస్టడీ చిత్రాలను తమిళ దర్శకులతోనే చేయడం గమనార్హం. బ్యాక్ టూ బ్యాక్ తమిళ దర్శకులతో రెండు సినిమాలు చేసి ప్లాప్స్ చూశారు. (తెలుగు తమిళ్) బైలింగువల్ గా ది వారియర్, కస్టడీ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ, ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. రెండు భాషల్లోనూ ఈ చిత్రాలు ఘోర పరాజయం పొందాయి.

Related News

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్‌ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Big Stories

×