E-Paper
Advertisement

అరటిపండ్లు Vs ఖర్జూరాలు.. ఉదయం ఖాళీ కడుపుతో వీటిలో ఏది తింటే ఎక్కువ లాభాలో తెలుసా?

అరటిపండ్లు Vs ఖర్జూరాలు.. ఉదయం ఖాళీ కడుపుతో వీటిలో ఏది తింటే ఎక్కువ లాభాలో తెలుసా?
Advertisement

Bananas VS Dates: ఉదయాన్నే లేవగానే కడుపులో ఎదోలా అనిపించి, టీ లేదా కాఫీ తాగేముందు ఏదైనా పండు తింటే బాగుండు అని చాలామంది అనుకుంటారు. అలాంటప్పుడు అందరికీ వెంటనే గుర్తుకువచ్చేవి అరటిపండు, ఖర్జూరం. అయితే ఖాళీ కడుపుతో ఈ రెండింట్లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిదనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి మన శరీర తత్వాన్ని బట్టి, ఆ సమయానికి శరీరానికి కావాల్సిన శక్తిని బట్టి ఏది ఉత్తమమో ఆధారపడి ఉంటుంది.

జీర్ణవ్యవస్థపై ప్రభావం:

మనం రాత్రంతా ఏమీ తినకుండా నిద్రపోతాం. కాబట్టి ఉదయాన్నే మన జీర్ణవ్యవస్థ చాలా తేలికపాటి, త్వరగా అరిగే ఆహారాన్ని కోరుకుంటుంది. ఉదయం పూట మనం తీసుకునే మొదటి ఆహారమే రోజంతా మన బ్లడ్ షుగర్ స్థాయిలను, మూడ్‌ను, పొట్ట ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఉదయాన్నే కడుపుకు ఏది పడితే అది ఇవ్వకుండా, తేలికగా జీర్ణమయ్యే పండ్లను ఎంచుకోవడం చాలా మంచిదని నిపుణులు చెప్తుంటారు.

బనానా అందించే ప్రయోజనాలు:

Advertisement

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. ఇవి పొట్టను శాంతపరిచి, జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అరటిలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది. ఉదయాన్నే వాకింగ్ లేదా వర్కవుట్స్ చేసేవారికి ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే అరటిపండును అలాగే తినడం కన్నా కొద్దిగా పెరుగు లేదా డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తింటే సులువుగా అరిగి, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.

Also Read: హోటల్ రూమ్‌లో అడుగు పెట్టగానే వాటర్ బాటిల్‌ను మంచం కిందకి దొర్లిస్తారు ఎందుకు?

ఖర్జూరంతో కలిగే లాభాలు:

Advertisement

ఖర్జూరంలో సహజమైన తీపి, పీచుతో పాటు ఐరన్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. రాత్రి వేళ నీళ్లలో నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే తినడం మన సాంప్రదాయంలో ఒక మంచి అలవాటు. ఇలా నానబెట్టి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగై, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఉదయాన్నే నీరసంగా అనిపించేవారికి ఖర్జూరం మంచి బూస్ట్ ఇస్తుంది. అయితే వీటిలో క్యాలరీలు, తీపి కాస్త ఎక్కువ కాబట్టి మోతాదుగా తినడం లేదా కాస్త ప్రొటీన్ ఉన్న ఆహారంతో కలిపి తీసుకోవడం శ్రేయస్కరం.

మన శరీరానికి ఏది బెస్ట్?

ప్రతి ఒక్కరి శరీర తత్వం ఒకేలా ఉండదు. కొంతమందికి అరటిపండు పడితే.. మరికొందరికి ఖర్జూరం బాగా సెట్ అవుతుంది. గ్యాస్, ఎసిడిటీ ఉన్నవారు అరటిపండును ఎంచుకోవచ్చు. అలాగే నీరసం, ఐరన్ లోపం ఉన్నవారు ఖర్జూరాన్ని ఎంచుకోవచ్చు. మీ శరీరానికి ఏది సరిపోతుందో గమనించి తినడమే అసలైన ఆరోగ్యం. ఏది తిన్నా మితంగా తింటే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

Also Read: సెలబ్రిటీలు చెప్పే 3 లీటర్ల నీళ్ల సూత్రం నిజంగా పనిచేస్తుందా? మీరు కూడా ఇలాగే చేస్తున్నారా?

Tags

Related News

చాణక్య నీతి.. వైవాహిక జీవితం సుఖంగా కలకాలం సాగాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి

దీపావళి వేళ జాగ్రత్త.. టపాసులు కాల్చే ముందు పిల్లలకు ఈ 6 విషయాలు నేర్పించండి

హోటల్ రూమ్‌లో అడుగు పెట్టగానే వాటర్ బాటిల్‌ను మంచం కిందకి దొర్లిస్తారు ఎందుకు?

ఒక్కసారిగా చెడు వార్త వింటే గుండెపోటు వస్తుందా? డాక్టర్ ఏం చెప్పారంటే

పండుగల వేళ మెరిసిపోయే ముఖం కావాలా? ఈ సూపర్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

దీపావళికి ఇల్లంతా మెరిసిపోవాలా? ఇదిగో తక్కువ శ్రమతో ఈ హోమ్ క్లీనింగ్ టిప్స్

కిచెన్ కత్తులు మెుద్దుబారాయా? ఇంట్లోని వస్తువులతో.. పదును పెట్టే మ్యాజిక్ ట్రిక్స్!

Big Stories

Advertisement
×