E-Paper
Advertisement

సెలబ్రిటీలు చెప్పే 3 లీటర్ల నీళ్ల సూత్రం నిజంగా పనిచేస్తుందా? మీరు కూడా ఇలాగే చేస్తున్నారా?

సెలబ్రిటీలు చెప్పే 3 లీటర్ల నీళ్ల సూత్రం నిజంగా పనిచేస్తుందా? మీరు కూడా ఇలాగే చేస్తున్నారా?
Advertisement

Skin Care Tips: రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగితేనే ముఖం మెరిసిపోతుంది, మొటిమలు తగ్గిపోతాయి అని సోషల్ మీడియాలో చాలాసార్లు చూసే ఉంటాం. కరీనా కపూర్ లాంటి సెలబ్రిటీలు కూడా తమ అందం వెనక రహస్యం నీళ్లే అని చెప్పడంతో చాలా మంది దీన్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. అయితే కేవలం నీళ్లు ఎక్కువగా తాగడం వల్లే చర్మం మెరుస్తుందనడంలో ఎంతవరకు నిజం ఉంది? అసలు మన చర్మానికి హైడ్రేషన్ ఏ విధంగా సహాయపడుతుంది అనే దానిపై నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీళ్లతోనే మెరుసైన చర్మం సాధ్యమా?

బాడీలో నీటి శాతం సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చర్మం తన పనులను సక్రమంగా చేసుకుంటుంది. కానీ, రోజూ మూడు లీటర్ల నీళ్లు తాగితేనే అందరికీ గ్లోయింగ్ స్కిన్ వస్తుందనేది ఒక అపోహ మాత్రమే. ప్రతి ఒక్కరి శరీరం తీరు వేర్వేరుగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన వాటర్ ఇంటేక్ సరిపోదు. అంతమాత్రాన నీళ్లు ఎక్కువగా తాగితేనే అందం వస్తుందని అనుకోవడం పొరపాటే.

Advertisement

Also Read: దీపావళికి స్వీట్స్ తింటూనే ఆరోగ్యం కాపాడుకోవాలా? ఈ 5 హెల్తీ లడ్డూలు ట్రై చేయండి!

అసలు హైడ్రేషన్ ఏం చేస్తుంది?

శరీరంలో నీరు తక్కువైతే చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది, పొడిబారిపోతుంది. అలాగే చిన్న వయసులోనే ముడతలు పడే అవకాశం ఉంటుంది. రోజూ సరిపడా నీళ్లు తాగడం వల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోకుండా ఉంటుంది. అయితే, అవసరానికి మించి ఎన్ని నీళ్లు తాగినా ముఖం మీద కాంతి పెరిగిపోతుంది అనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

ఎంత నీరు తాగితే సరిపోతుంది?

Advertisement

ప్రతి ఒక్కరి వయసు, బరువు, పనిచేసే వాతావరణం, తినే ఆహారాన్ని బట్టి నీటి అవసరాలు మారుతుంటాయి. మన దేశంలో వేసవిలో ఎక్కువ చెమట పడుతుంది కాబట్టి.. కాస్త ఎక్కువ నీళ్లు తాగుతాం. అంతేతప్ప అందరూ కచ్చితంగా మూడు లీటర్లే తాగాలని రూల్ ఏమీ లేదు. మనం తినే కూరగాయలు, పండ్లలో నుంచి కూడా శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది.

చర్మ సంరక్షణకు ఏం చేయాలి?

కేవలం నీళ్ల మీద ఆధారపడకుండా మంచి పోషకాహారం తీసుకోవడం, విటమిన్లు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర, ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటివి చర్మాన్ని కాపాడుతాయి. ఒకవేళ ముఖం మీద మొటిమలు, మచ్చలు లేదా విపరీతమైన పొడిబారడం లాంటి సమస్యలు ఉంటే మాత్రం ఎవరి మాటలో వినేకండా నేరుగా చర్మ నిపుణులను (డెర్మటాలజిస్ట్) కలవడం మంచిది.

Also Read: పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదంటారు ఎందుకు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Tags

Related News

కోపంలో నోరుజారి మీ పార్ట్‌నర్‌తో ఈ 4 మాటలు అన్నారో.. మీ ప్రేమ కథ అక్కడితో క్లోజ్!

డిప్రెషన్, ఆందోళనకు దూరంగా ఉండాలా? బామ్మల కాలం నాటి ఈ 6 హాబీలు మళ్లీ పాటించండి

పిల్లల్లోనూ గుండె జబ్బుల ముప్పు.. 10 ఏళ్ల వయసులోనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాలి

దీపావళికి స్వీట్స్ తింటూనే ఆరోగ్యం కాపాడుకోవాలా? ఈ 5 హెల్తీ లడ్డూలు ట్రై చేయండి!

90 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవిస్తున్న జపాన్ ప్రజలు.. కారణాలివే

కోపం వస్తే దాన్ని అణుచుకోకూడదు.. మన:శాంతి కోసం ఓషో చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి

ప్రెగ్నెన్సీ తొమ్మిదో నెలలో వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న సమంత.. ఆ సమయంలో చేయడం తల్లి, బిడ్డకు మంచిదేనా?

Big Stories

Advertisement
×