E-Paper
Advertisement

జైలు గోడల మధ్య ఆటలు, పాటలు.. ఖైదీల్లో మార్పు కోసం మార్గదర్శిగా ఉల్లాసం!

జైలు గోడల మధ్య ఆటలు, పాటలు.. ఖైదీల్లో మార్పు కోసం మార్గదర్శిగా ఉల్లాసం!
Advertisement

Ullasam Initiative: స్వేచ్ఛ బ్యూరో: ఖైదీల సంస్కరణ.. సంక్షేమం కోసం పలు చర్యలు అమలు చేస్తున్న తెలంగాణ జైళ్ల శాఖ తాజాగా ‘ఉల్లాసం’ పేర మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, స్వీయహాని ప్రవర్తన, ఆత్మహత్యా ధోరణులను తగ్గించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అదే సమయంలో ఆనందం, సానుకూల ఆలోచనలు, మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించారు. సోమవారం ఉల్లాసం కార్యక్రమాన్ని చెంచల్​ గూడ కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారంలో దీనిని ప్రారంభించారు. జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఆలోచనతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ఖైదీలను వినోద, క్రీడా, ఇతర సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా వారి మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు హైదరాబాద్ కు చెందిన ట్రెస్టిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సహకారం అందిస్తోంది.

డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ..

Advertisement

చెంచల్​ గూడ సెంట్రల్​ జైలు, మహిళా ప్రత్యేక కారాగారంలో క్రీడా కార్యక్రమాలను జెండా ఊపి ప్రారంభించిన డీజీ సౌమ్య మిశ్రా ఖైదీలు వీటిల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రోత్సహించారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఖైదీల్లో ఒత్తిడిని తగ్గించటానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. ఖైదీలలో మానసిక ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మరియు ఆత్మహత్యా ప్రవృత్తులను తగ్గించడంతో పాటు, వారి శక్తిని సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించి జైళ్లలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ప్రతి ఖైదీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ

Advertisement

ఖైదీల కోసం వివిధ ఇండోర్ మరియు అవుట్ డోర్ వినోద, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పురుష ఖైదీల కోసం వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, త్రో బాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, ఇతర బోర్డు గేమ్స్ నిర్వహిస్తున్నారు. మహిళా ఖైదీల కోసం పజిల్ గేమ్స్, మ్యూజికల్ చైర్స్, నిమ్మకాయతో స్పూన్ రేస్, బెలూన్ గేమ్, రన్నింగ్ రేస్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తోపాటు ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖైదీల వయస్సు, శారీరక స్థితి, వ్యక్తిగత సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని, ప్రతి ఖైదీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా క్రీడల్లో పాల్గొనేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. ఖైదీల ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొంటూ జట్టు స్ఫూర్తి, సమన్వయం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.

త్వరలోనే చర్లపల్లిలో..

ఉల్లాసం కార్యక్రమాన్ని త్వరలోనే చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆ తరువాత క్రమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలోని ఖైదీలను కూడా దీంట్లో భాగస్వాములుగా చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. చెంచల్​ గూడ సెంట్రల్​ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్​ గౌడ్​, మహిళా ప్రత్యేక కారాగారం డిప్యూటీ సూపరింటెండెంట్ అమరావతి, తమ సిబ్బందితో కలిసి సిబ్బందిని సమన్వయం చేసుకుని ఉల్లాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రెస్టిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్, హైదరాబాద్ బృందంలో సుధారాణి, కోఆర్డినేటర్ (ఆపరేషన్స్) జెనీవ్ మేరీ పక్కి, అడ్మినిస్ట్రేటర్ దీప్నా, టీచర్లు ప్రశాంతి కనపర్తి, మోనికా మాధురి, హారికలు పాల్గొన్నారు. కార్యక్రమానికి జైళ్ల శాఖ ఐజీలు రాజేష్, మురళీ బాబు హాజరయ్యారు.

Also Read:సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు పోల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. దంపతులు దుర్మరణం! 

Tags

Related News

రెవెన్యూ, ఫారెస్ట్ భూములపై కీలక నిర్ణయం.. ఏళ్ల నాటి సమస్యకు మంత్రి పొంగులేటి మాస్టర్ ప్లాన్!

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. కరెంటు పోల్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. దంపతులు దుర్మరణం!

తెలంగాణలో ఖేలో ఇండియా ధమాకా.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

సొంత బావలు ఎంత పని చేశారు.. మరదల్ని ఇంట్లోకి రప్పించి గొంతు కోశారు, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైడ్రా బిగ్ షాక్.. ఫామ్‌హౌస్‌ ప్రహరీ గోడ కూల్చివేసిత!

క్యాంపస్ హబ్ AI ప్రొడక్ట్ లాంచ్‌లో కేటీఆర్.. గ్రామీణ యువతపై ప్రశంసల జల్లు

కన్‌స్ట్రక్షన్లకు మంచినీళ్లు వాడుతున్నారా.. జలమండలి మరో మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×