E-Paper
Advertisement

ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!

ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!
Advertisement

ఆస్తులు రాసివ్వడం గురించి మీరు వినే ఉంటారు. మరి, ఆత్మలను రాసివ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, మీరు ఇది తప్పకుండా తెలుసుకోవల్సిందే. చిన్నప్పటి నుంచి గిటారు వాద్యకారుడు కావాలని కలలుగన్న ఓ వ్యక్తి.. ఓ పిశాచి ద్వారా తన కలను నెరవేర్చుకున్నాడట. ఒక్క చిన్న ఒప్పందంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడట. వినడానికి చిత్రంగా ఉన్న ఈ ఒప్పందాన్ని.. మిసిసిపీ క్రాస్ రోడ్ డెవిల్ అగ్రీమెంట్ అని పిలుస్తారు.

మనుషులు.. ఆత్మల ప్రపంచాన్ని కలిపే కూడలి

అమెరికన్ బ్లూస్ సంగీత చరిత్రలోనే దీన్ని అత్యంత భయానక కథగా అభివర్ణిస్తారు. ఇది పశ్చిమ ఆఫ్రికాలో పుట్టి దక్షిణ అమెరికా రాష్ట్రాల వరకు పాకడానికి కారణం.. రాబర్ట్ జాన్సన్ బ్లూస్ సంగీతకారుడు. అతడి గురించి తెలుసుకోడానికి ముందుగా.. మీరు ఈ మిసిసిపీ క్రాస్ రోడ్ ఒప్పందం గురించి తెలుసుకోవాలి. వూడూ సంస్కృతిలో నాలుగు దారుల కూడలిని.. యోరుబా అని పిలుస్తారు. ఇది భౌతిక ప్రపంచానికి, ఆత్మల ప్రపంచానికి మధ్య ఉండే ఒక సరిహద్దు. ఈ కూడలికి అధపతి.. పాపా లెగ్బా. అతడు మనుషులకు, ఆత్మలకు మధ్య జరిగే సంభాషణలను అనువాదించే దేవత. అయితే, కాలక్రమేనా.. క్రిస్టియానిటీ ప్రభావం వల్ల పాపా లెగ్బాను ఒక రాక్షసుడిగా లేదా క్రాస్ రెడ్ డెవిల్‌గా చీత్రీకరించడం మొదలుపెట్టారు.

ఆత్మను రాసిస్తే.. ఏం కావాలన్నా జరుగుతుందా?

Advertisement

ఇక మిసిసిపీ క్రాస్ రోడ్ ఒప్పందం విషయానికి వస్తే.. వూడూ జానపద కథల్లో ఆత్మను పిశాచాలకు రాసివ్వడాన్ని ఒక భయానక ఒప్పందంగా భావిస్తారు. క్రైస్తవ, పాశ్చాత్య ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం.. మనిషి శరీరం తాత్కాలికం. కానీ ఆత్మకు చావు ఉండదు. అమరమైనది. మరణం తర్వాత ఆత్మ స్వర్గానికి వెళ్లాలి. కానీ, మిసిసిపీ ఒప్పందంలో అలా జరగదు. స్వర్గానికి వెళ్లాల్సిన ఆత్మను పిశాచికి ఇచ్చేయాలి. దానివల్ల ఆ వ్యక్తి ఆత్మ స్వర్గానికి వెళ్లకుండా.. ఆ పిశాచికి శాస్వతంగా బానిసగా మిగిలిపోతుంది. అలా ఒప్పందం కుదుర్చుకున్న ఆత్మలతో ఆ పిశాచి మరింత భయానకంగా, బలమైన సైతాన్‌గా మారుతుంది.

ఈ ఒప్పందం ఎలా జరుగుతుంది?

పాశ్చాత్య సాంప్రదాయాల ప్రకారం.. జీవితంలో ఏలాంటి ఎదుగుదల లేకుండా, ఇక బతకడం వ్యర్థం అనుకొనే వ్యక్తులు.. నాలుగు దారుల కూడలి వద్దకు వస్తారు. అక్కడ క్షుద్ర పూజలు చేసి.. దుష్టశక్తిని పిలుస్తారు. ఆ తర్వాత చర్మంతో చేసిన కాగితంపై తమ రక్తంతో సంతకం చేసి.. సైతాన్‌కు అప్పగిస్తారు. అయితే, వూడూ సంప్రదాయాల్లో రక్తంతో ఒప్పందం రాసివ్వాల్సిన పనిలేదు. అర్ధరాత్రి దాదాపు 12 గంటలకు మిసిసిపీ క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లి.. మాటలతో ఒప్పందం చేసుకుంటే చాలు. ‘‘ఇక నా శరీరం నీది. నువ్వు ఇచ్చే కళ నాది’’ అని చెబితే చాలు. అలాగే వారిలో ఉండే భక్తి, ఆధ్యాత్మికత అంతా అక్కడే విడిచిపెట్టి చెడునే నమ్ముకోవాలి. అంటే.. దేవుడి కంటే ఎక్కువగా దెయ్యాలనే నమ్మాలి.

ఎవరు ఈ రాబర్ట్ జాన్సన్ బ్లూస్

Advertisement

1911లో మిసిసిపీలో జన్మించిన రాబర్ట్ జాన్సన్ బ్లూస్‌కు గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. కానీ, కెరీర్ ప్రారంభంలో అతడికి అస్సలు వాయించడమే వచ్చేది కాదు. అతడు గిటారు మోగిస్తుంటే.. తోటి కళాకారులు ‘‘వీడు భయంకర శబ్దాలు చేస్తున్నాడు. జీవితంలో వీడికి గిటారు రాదు’’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆ తర్వాత రాబర్ట్.. కొన్ని నెలలుపాటు ఎవరికీ కనిపించలేదు. ఆ ఊరి నుంచి మయమైపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత అతడు గిటార్ వాయించే తీరు పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు ఎవరూ వినని అసాధారణమైన వేగంతో క్లిష్టమైన స్వరాలు పలికిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలా అతడు హటాత్తుగా ప్రతిభావంతుడు కావడానికి కారణం.. ఆ క్రాస్ రోడ్డు డెవిల్ ఒప్పందమే అంటూ జనాలు భావించడం మొదలుపెట్టారు.

ఆ ఆత్మతో ఒప్పందం చేసుకొనే ఎదిగాడా?

ఊరి నుంచి వెళ్లిపోయిన రాబర్ట్.. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు మిసిసిపీలోని 61, 49 నెంబర్ రోడ్లు కలిసే క్రాస్ రోడ్స్ వద్దకు వెళ్లాడు. అక్కడ గిటారు పట్టుకుని నిలబడగా.. ఒక భారీ ఆకారంలో ఉన్న నల్లటి వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత అతడు రాబర్ట్ చేతిలోని గిటార్ తీసుకుని.. దాన్ని శృతి చేసి.. కొన్ని పాటలు వాయించి తిరిగి ఇచ్చేశాడు. ఆ సైతాన్ గిటార్ తిరిగి ఇవ్వడంతో ఒప్పందం పూర్తయినట్లే. దానికి అర్థం.. ప్రపంచంలోనే అత్యుత్తమ గిటార్ కళాకారుడిగా మారే విద్యకు ప్రతిఫలంగా రాబర్ట్ జాన్సన్ తన ఆత్మను సైతాన్‌కు రాసిచ్చాడు.

ఆ పాటలతో నిజం చెప్పేశాడా?

రాబర్ట్ ఆ ఒప్పందం చేసుకున్నాడని ప్రజలు బలంగా నమ్మడానికి కారణం.. అతడు ఆలపించిన పాటలే. ఊరికి తిరిగి వచ్చిన తర్వాత.. రాబర్ట్ ఎక్కువగా దెయ్యాలు, సైతాన్, డెవిల్ గురించి ఎక్కువగా తన పాటల్లో ప్రస్తావించేవాడు. అంతేగాక.. క్రాస్ రోడ్ బ్లూస్ అనే పాటలో కూడలి వద్ద తాను మోకాళ్లపై కూర్చొని ప్రార్థించినట్లుగా చెప్పాడు. ఉదయాన్నే దెయ్యం వచ్చి తలుపు తట్టిందని, ఇద్దరం కలిసి నడుస్తున్నామంటూ మరో పాట కూడా రాశాడు. నరకం నుంచి వచ్చిన కుక్కలు తన వెంట పడుతున్నాయంటూ తన భయానక అనుభవాన్ని మరొక పాటలో వర్ణించాడు.

Also Read: హోటల్ రూమ్‌లో అడుగు పెట్టగానే వాటర్ బాటిల్‌ను మంచం కిందకి దొర్లిస్తారు ఎందుకు?

27 ఏళ్లకే మరణం.. కారణం ఆ ఒప్పందమేనా?

తాను కోరుకున్నట్లే గిటార్, గాయకుడిగా మంచి పేరు సంపాదించిన రాబర్ట్.. చిన్న వయస్సులోనే మరణించాడు. 1938 సంవత్సరంలో 27 ఏళ్ల వయస్సులో అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. అతడిపై విషప్రయోగం జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. 27 ఏళ్ల వయస్సులోనే చనిపోయిన ప్రసిద్ధ సంగీతకారుల జాబితా(27 క్లబ్)లో మొదటి వ్యక్తి రాబర్ట్ జాన్సన్ కావడంతో.. ఈ కథకు మరింత ప్రాచుర్యం తెచ్చింది. అయితే, ఈ కథను చాలామంది కొట్టిపరేస్తారు. అవమానం తట్టుకోలేక రాబర్ట్ జాన్సన్ కొన్నేళ్లు సమాజానికి దూరంగా వెళ్లి.. పగలు, రాత్రి తేడా లేకుండా గంటల తరబడి గిటార్ సాధాన చేసి ఉండవచ్చని, అకస్మాత్తుగా ఊరికొచ్చి వాయించేసరికి ప్రజలు అతడి కష్టాన్ని గుర్తించలేక ఇలా కట్టుకథ చెప్పి ఉంటారని అంటారు.

Tags

Related News

మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..

ఇక కరీంనగర్-వరంగల్ నాన్‌స్టాప్ బస్సులు.. పూర్తి షెడ్యూల్ ఇదే?

ఆన్‌లైన్ హోటల్ రివ్యూలు చూసి మోసపోతున్నారా? ఫేక్ రివ్యూలను కనిపెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!

విమాన ప్రయాణం వేస్ట్.. ఈ రైలు జర్నీనే బెస్ట్.. 5-స్టార్ హోటల్ ఫీలింగ్!

ఇక విదేశాల్లోనూ వందే భారత్ పరుగులు.. రైల్వేమంత్రి సంచలన ప్రకటన!

గంటకు 280 కి.మీ వేగం.. 557 మంది ప్రయాణం.. భారత తొలి బుల్లెట్ రైలు ప్రత్యేకతలివే!

విమాన టికెట్ ధరలు భారీగా పెరిగితే కేంద్రం జోక్యం.. కొత్త రూల్స్ ఇవే!

Big Stories

Advertisement
×