Jio Rs 111 Plan: మొబైల్ డేటాతో పాటు గేమింగ్, ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వినియోగదారుల కోసం ‘రూ. 111 ఫ్లెక్సీ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్’ను జియో అందుబాటులోకి తెచ్చింది. సాధారణ రీఛార్జ్ ప్లాన్లకు భిన్నంగా ఈ ప్లాన్ ద్వారా రెండు రకాల డిజిటల్ సేవలను కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. అందులో నచ్చిన ఒక దానిని మైజియో యాప్ ద్వారా ఎంచుకునే వెసులుబాటును జియో కల్పించింది. ఇంతకీ ఈ రూ.111 ప్లాన్ ప్రత్యేకతలు ఏంటి? దీని వల్ల యూజర్లకు లభించనున్న బెనిఫిట్స్ పై ఓ లుక్కేద్దాం.
రూ.111 ధరతో వచ్చిన ఈ ఫ్లెక్సీ యూత్ అండ్ గేమింగ్ ప్యాక్ వ్యాలిడిటీని 28 రోజులుగా జియో నిర్ణయించింది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 5GB హై-స్పీడ్ డేటా పొందొచ్చు. ప్లాన్ వ్యవధిలో ఎప్పుడైనా ఈ డేటాను వినియోగించుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాన్ ను రెండు ప్యాక్ లుగా జియో విభజించింది. గేమింగ్ ప్యాక్, యూత్ ప్యాక్ పేరుతో విభిన్నమైన బెనిఫిట్స్ తో దీనిని పరిచయం చేసింది.
మొబైల్ గేమింగ్ సేవలను ఇష్టపడే వారి కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీనిని ఎంచుకుంటే ‘జియోగేమ్ మొబైల్’ (JioGame Mobile) బెనిఫిట్ ను యూజర్లు పొందొచ్చు. 56 రోజులు కాలపరిమితితో హ్యాపీగా గేమ్స్ ఆడుకోవచ్చు.
ఈ ఆప్షన్‌ను ఎంచుకునే వారికి మూడు రకాల డిజిటల్ సేవలను జియో ఆఫర్ చేస్తోంది. జియోగేమ్ మొబైల్, ఫ్యాన్‌కోడ్ (FanCode), స్నాప్‌చాట్+ (Snapchat+) సేవలను 28 రోజుల కాలపరిమితితో వినియోగించుకోవచ్చు. గేమింగ్, లైవ్ మ్యాచ్ లు, ప్రీమియం సోషల్ మీడియా ఫీచర్ల కలయికగా ఈ యూత్ ప్యాక్‌ను జియో తీసుకొచ్చింది. ఫ్యాన్ కోడ్ యాప్ ను ఉపయోగించి.. క్రీడలకు సంబంధించిన కంటెంట్‌ను వీక్షించే వెసులుబాటును జియో కల్పించింది.
Also Read: అరటిపండ్లు Vs ఖర్జూరాలు.. ఉదయం ఖాళీ కడుపుతో వీటిలో ఏది తింటే ఎక్కువ లాభాలో తెలుసా?
రూ.111 రీఛార్జ్ పూర్తి చేసిన వెంటనే వినియోగదారులు తమ మొబైల్‌లోని MyJio యాప్‌ను ఓపెన్ చేసి.. గేమింగ్ ప్యాక్ లేదా యూత్ ప్యాక్‌లలో తమకు కావలసినదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. రీఛార్జ్ చేసిన తేదీ నుంచి 28 రోజులలోపు ఈ బెనిఫిట్స్‌ను రిడీమ్ (Redeem) చేసుకోవడం తప్పనిసరి. జియోగేమ్స్ (JioGames) యాప్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌ను యాక్సెస్ చేయవచ్చు. అలాగే మైజియో యాప్ ద్వారా స్నాప్ చాట్ +, జియో టీవీ మెుబైల్ యాప్ ద్వారా ఫ్యాన్ కోడ్ కంటెంట్ ను వీక్షించవచ్చని జియో వర్గాలు పేర్కొన్నాయి.