E-Paper
Advertisement

హోటల్ రూమ్‌లో అడుగు పెట్టగానే వాటర్ బాటిల్‌ను మంచం కిందకి దొర్లిస్తారు ఎందుకు?

హోటల్ రూమ్‌లో అడుగు పెట్టగానే వాటర్ బాటిల్‌ను మంచం కిందకి దొర్లిస్తారు ఎందుకు?
Advertisement

Hotel Safety Tips: మనం ఆఫీస్ పనిమీద వేరే ఊరు వెళ్లినా లేదంటే కుటుంబంతో సరదాగా ట్రిప్ వెళ్లినా హోటల్ గదుల్లోనే ఉంటాం. అయితే ఈ క్రమంలో రూమ్ కీ తీసుకోగానే లగేజ్ లోపల పడేసి, హాయిగా బెడ్‌పై వాలిపోవడం మనందరికీ అలవాటే. కానీ, రూమ్‌లో అడుగుపెట్టిన వెంటనే మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఒక్కోసారి మన భద్రతకే ముప్పుగా మారవచ్చు. అందుకే అనుభవజ్ఞులైన ప్రయాణికులు హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే కొన్ని ఉపయోగకరమైన చిట్కాలను పాటిస్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాటర్ బాటిల్ ట్రిక్:

డచ్ విమాన సంస్థలో పనిచేసే ఈస్టర్ స్ట్రస్ అనే ఫ్లైట్ అటెండెంట్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక చిట్కా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మీరు హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఒక నీళ్ల బాటిల్‌ను మంచం కిందకి దొర్లించాలి. ఒకవేళ ఆ బాటిల్ బెడ్ అవతలి వైపు నుండి సులభంగా బయటకు వస్తే.. మంచం కింద ఎవరూ లేరని అర్థం. అలా కాకుండా బాటిల్ మధ్యలోనే ఆగిపోతే, కింద ఎవరో దాక్కున్నారని హెచ్చరికగా భావించాలి. వినడానికి కొంచెం వింతగా ఉన్నా, రూమ్ భద్రతను క్షణాల్లో చెక్ చేయడానికి ఇది భలేగా పనిచేస్తుంది.

Advertisement

Also Read: ఇంతకాలం ఈ విషయం తెలియక ఎంత ఇబ్బంది పడ్డామో.. ఫోన్ ఛార్జర్‌తోనే ట్రిమ్మర్‌కు ఛార్జింగ్!

లాకర్‌లో బూట్లు:

చాలామంది హోటల్ రూమ్‌లోని సేఫ్ లాకర్‌లో డబ్బులు, బంగారం లేదా ముఖ్యమైన పత్రాలు పెట్టి, చెక్ అవుట్ అయ్యేటప్పుడు మరచిపోతుంటారు. దీనికి ఈస్టర్ ఒక మంచి పరిష్కారం చెప్పింది. లాకర్‌లో మీ విలువైన వస్తువులతో పాటు మీ షూని కూడా అందులోనే పెట్టండి. బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేకుండా ఎలాగూ ప్రయాణం చేయలేం కాబట్టి.. బూటు తీసుకునే క్రమంలో లాకర్‌లోని విలువైన వస్తువులను కూడా గుర్తుపెట్టుకుని తీసుకెళ్తారు.

రక్షణ, గోప్యత:

Advertisement

ఈ రోజుల్లో హోటల్ గదుల్లో భద్రతతో పాటు గోప్యత కూడా పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు సీక్రెట్ కెమెరాల గురించి భయపడుతుంటారు. అందుకే గదిలోకి రాగానే తలుపు గడియ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే బాత్‌రూమ్, ఏసీ వెంట్లు, కాలింగ్ బెల్ లాంటి చోట్ల ఏవైనా హిడెన్ కెమెరాలు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Also Read: రూ.60 వేల శాంసంగ్ టీవీ ఇంత తక్కువకే వస్తే ఎవరు వదులుకుంటారు? దీపావళికి డబుల్ ధమాకా!

Tags

Related News

దీపావళి వేళ జాగ్రత్త.. టపాసులు కాల్చే ముందు పిల్లలకు ఈ 6 విషయాలు నేర్పించండి

ఒక్కసారిగా చెడు వార్త వింటే గుండెపోటు వస్తుందా? డాక్టర్ ఏం చెప్పారంటే

పండుగల వేళ మెరిసిపోయే ముఖం కావాలా? ఈ సూపర్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

దీపావళికి ఇల్లంతా మెరిసిపోవాలా? ఇదిగో తక్కువ శ్రమతో ఈ హోమ్ క్లీనింగ్ టిప్స్

కిచెన్ కత్తులు మెుద్దుబారాయా? ఇంట్లోని వస్తువులతో.. పదును పెట్టే మ్యాజిక్ ట్రిక్స్!

రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ పొటాటో ఫింగర్స్..క్షణాల్లోనే రెడీ చేయొచ్చు

క్యాబేజీ పప్పు ఇలా చేస్తే..ఎవ్వరైనా లొట్టలేసుకుంటూ తింటారు!

Big Stories

Advertisement
×