BigTV English

Beetroot Face Pack: కొరియ‌న్ మ‌హిళ‌ల లాంటి మెరుపు కావాలంటే.. బీట్‌రూట్‌తో ఈ ఫేస్ మాస్క్‌లు ట్రై చేయండి..

Beetroot Face Pack: కొరియ‌న్ మ‌హిళ‌ల లాంటి మెరుపు కావాలంటే.. బీట్‌రూట్‌తో ఈ ఫేస్ మాస్క్‌లు ట్రై చేయండి..

Beetroot Face Pack: అందమైన ముఖం కావాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. ముఖం కాంతివంతంగా, స్కిన్ గ్లోయింగ్‌గా కనిపించాలని కోరుకుంటారు. కానీ బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహారం, పండ్లు తీసుకోకపోవడం వల్ల చర్మంపై అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికితోడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిందే. ఇక ఎండ వల్ల స్కిన్ డల్‌గా మారిపోవడం, కమిలిపోవడం, ముఖంపై మురికి చేరిపోవడం.. వీటివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వచ్చేస్తుంటాయి.


ఇందుకోసం చాలా మంది మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్, వేలకు వేలు ఖర్చు చేసి పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి చర్మానికి హానికలిగే ప్రమాదం ఉంది.  శాశ్వతంగా ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. బీట్‌రూట్‌తో ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి. ఉత్తమ ఫలితం ఉంటుంది. బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో.. చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిది. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మ రక్షణకు చక్కగా పనిచేస్తాయి. ఇందుకోసం బీట్‌రూట్‌తో ఈ ఫేస్ ప్యాక్‌లు ముఖానికి ట్రై చేశారంటే.. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్, పచ్చి పాలు ఫేస్ ప్యాక్
ముందుగా బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చిన్న బౌల్‌లో తీసుకుని రెండు టేబుల్ స్పూన్ పచ్చి పాలు కలిపి ముఖాన్ని పెట్టుకుని, 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. ముఖంపై మురికి తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.


బీట్‌రూట్, బియ్యం పిండితో ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బీట్‌రూట్‌ రసం, రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలిపి ముఖానికి పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖానికి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. చర్మం స్పూత్‌గా తయారవుతుంది. ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

బీట్‌రూట్, తేనె, పసుపు ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బీట్‌రూట్ రసం, తేనె, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పెట్టుకుని.. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

Also Read: బంగాళదుంపతో ఫేస్ ప్యాక్.. చర్మానికి తక్షణ నిగారింపునిస్తుంది!

బీట్‌రూట్, పచ్చి పాలు, శెనగపిండి
చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ బీట్‌రూట్ రసం, టేబుల్ స్పూన్ పచ్చిపాలు, టేబుల్ స్పూన్ శెనగపిండి కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు, డార్క్ సర్కిల్స్‌ను తొలగించి కాంతివంతంగా మారేలా సహాయపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×