Potato Face Pack : సమ్సర్ సీజన్ వచ్చేసింది.. ఈ కాలంలో ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ కిరణాల వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. అంతేకాదు ఎండ వల్ల ముఖం కమిలిపోవడం, ఫేస్‌పై మురికి చేరిపోవడం, ముఖంపై మొటిమలు, మచ్చలు వచ్చేస్తుంటాయి. చాలామంది వీటిని తొలగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటి వల్ల ఫలితం ఉండకపోవచ్చు. ఇందుకోసం మన ఇంట్లోనే.. ప్రతి రోజు వండుకునే కూరగాయలతోనే ఆరోగ్యంతో పాటు.. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక వాటి కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ వేలకు వేలు ఖర్చు చేసి తిరగాల్సిన అవసరం లేదు. ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. పొటాటోతో ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంప, కాఫీ పొడి రోజ్, వాటర్ ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్, నిమ్మరసం, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాదు మొటిమలు, మచ్చలు, డార్క్‌సర్కిల్స్‌ను కూడా తొలగించడంలో సహాయపడతాయి.
పొటాటో, పచ్చిపాలు, పెరుగు ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు చేబుల్ స్పూన్ పొటాటో రసం, రెండు టీ స్పూన్లు పచ్చిపాలు, టీ స్పూన్ పెరుగు కలిపి ఫేస్‌కి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ముఖానికి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికిని తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
బంగాళదుంప, బియ్యంపిండి, కలబంద ఫేస్ ప్యాక్
ముందుగా బంగాళదుంప, కలబంద మిక్సీజార్‌లోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో టీ స్పూన్ బియ్యంపిండి, చిటికెడు పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉన్న మృతకణాలను తొలగించి, చర్మం గ్లోయింగ్‌గా కనిపించేలా చేస్తుంది.
బంగాళదుంప, తేనె ఫేస్ ప్యాక్
స్కిన్‌డల్‌గా అనిపించినప్పుడు ఈ ఫేస్‌ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం బంగాళదుంప గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పెట్టుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.