Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత (Samantha)ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ముఖ్యంగా సమంత వ్యక్తిగత జీవితం, ఇటు వృత్తిపరమైన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పవచ్చు. తమిళంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. తెలుగులో ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య(Naga Chaitanya) తో ప్రేమలో పడ్డ ఈమె దాదాపు ఏడేళ్ల పాటు అతడిని ప్రేమించి, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట..కలిసి సినిమాలు కూడా చేశారు. ఇక అంతా బాగుంది అనుకునే లోపే, సడన్గా 2021 అక్టోబర్ 2న సోషల్ మీడియా వేదికగా విడాకులు ప్రకటించి, అటు సినీ సెలబ్రిటీలను ఇటు అభిమానులను ఆశ్చర్యపరిచారు.
Shobhita dhulipala: తన ఫస్ట్ క్రష్ చైతూ కాదంటూ షాక్ ఇచ్చిన శోభిత.. ఆయన్ని చూసి మైమరిచిపోయానంటూ..?
మిస్టరీ వీడని నాగచైతన్య – సమంత విడాకుల వ్యవహారం..
ఇక నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అని ఇప్పటికీ కూడా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటివరకు అసలు కారణం మాత్రం తెలియడం లేదు. ఇక నాగ చైతన్య నుండి దూరమైన తర్వాత సమంత డిప్రెషన్ లోకి మునిగిపోయి.. ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన కూడా పడింది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ చికిత్స తీసుకుంది. అంతేకాదు ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన ఈమె, ఇటీవల బాలీవుడ్ లో ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, హై యాక్షన్ పెర్ఫార్మన్స్ తో తనను తాను నిరూపించుకుంది . ఇక ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత.అటు నాగచైతన్య మాత్రం సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు.
అత్యంత విలువైన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని మార్చేసిన సమంత..
ఇకపోతే విడిపోయిన సరే మళ్లీ కలుస్తారు అనుకున్నారు కానీ నాగచైతన్య శోభితాను వివాహం చేసుకోవడంతో ఇక అందరి ఆశలకు తెరపడింది అని చెప్పాలి. అటు సమంత కూడా అతడి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపిస్తూ వస్తోంది. ఎంతో విలువైన ఎంగేజ్మెంట్ రింగును కూడా మార్చేసినట్లు సమాచారం. నాగచైతన్య.. సమంత నిశ్చితార్థం జరిగినప్పుడు.. మూడు క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగును నాగచైతన్య ఆమె వేలికి తోడిగాడు. సమంత కూడా ఈ ఉంగరాన్ని చాలా సందర్భాలలో బయటపెట్టింది. అయితే ఇప్పుడు ఆ ఉంగరం ఆమె చేతికి కనిపించడం లేదు. దీంతో సమంత ఆ ఉంగరాన్ని ఏం చేసిందని అందరూ ఆరా తీస్తూ ఉండగా.. ఆమె ఆ ఉంగరాన్ని అందమైన పెండెంట్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పెండెంట్ ను బంగారు చైన్ కు తగిలించి అప్పుడప్పుడు మెడలో ధరిస్తూ ఉంటుందట సమంత. ఇకపోతే ఇలా వస్తువులను మార్చి వాడుకోవడం సమంతకు ఇదేమి తొలిసారి కాదు.. తన తెల్లటి వెడ్డింగ్ గౌన్ ను.. నల్లటి బాడీ కాన్ డ్రెస్ గా కూడా మార్చేసింది. ఇకపోతే నాగచైతన్యకు సంబంధించిన వస్తువులు అన్నింటిని మార్చేస్తోంది. కానీ ఆయన గుర్తుగా తన శరీరంపై వేయించుకున్న టాటూ లను మాత్రం సమంత చెరపలేకపోవడం గమనార్హం.