BigTV English

10 Best Haleem Hyderabad: నోరూరించే హలీం కావాలా? హైదరాబాద్ లో బెస్ట్ రెస్టారెంట్లు ఇవే!

10 Best Haleem Hyderabad: నోరూరించే హలీం కావాలా? హైదరాబాద్ లో బెస్ట్ రెస్టారెంట్లు ఇవే!

Hyderabad Haleem: హైదరాబాద్ కు హలీంకు విడదీయరాని సంబంధం ఉంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఎక్కడ చూసిన హలీం వాసల ఘుమఘుమలాడుతుంది. హలీం లేకుండా రంజాన్ ను ఊహించుకోలేరంటే, దానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన హలీం అందించడంలో హైదరాబాద్ లోని పాపులర్ హోటళ్లు పోటీ పడుతాయి. టేస్టీలో రాజీ లేకుండా అందించడంలో ముందుంటున్నాయి. హైదరాబాద్ లో మైమరచిపోయే హలీం తినాలని మీరూ భావిస్తున్నారా? అయితే, ఆహా అనిపించే హలీం దొరికే బెస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ పిస్తా హౌస్

హైదరాబాద్ లో హలీం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పిస్తా హౌస్. గత 25 ఏండ్లుగా ఈ రెస్టారెంట్ తమ కస్టమర్లకు రుచికరమైన హలీం అందిస్తోంది. పిస్తా హౌస్ హలీం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు హలీం, బిర్యానీ, కబాబ్‌ లు, షవర్మాలు అందిస్తోంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఒక్కసారైనా పిస్తా హౌస్ హలీం టేస్ట్ చేయాల్సిందే! ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు హలీం లభిస్తుంది.


అడ్రస్: 2-48, ప్లాట్ 424, అపోజిట్ కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి.

⦿ సలీం కి హలీం

హలీం అభిమానులను ఆకట్టుకనే మరో ప్రదేశం సలీం కి హలీం రెస్టారెంట్. హైదరాబాద్‌ లోని హలీం ప్రియులు ఇక్కడ తినేందుకు ఎంతగానో ఇష్టపడుతారు. తక్కువ ధరలో బెస్ట క్వాలిటీ హలీం అందిస్తారు. నగరం నడిబొడ్డున ఉన్న సలీం కి హలీం రెస్టారెంట్ ముందు రంజాన్ సందర్భంగా సాయంత్రం అయితే పొడవైన క్యూలు కనిపిస్తాయి. ఇక్కడ ఉదయం 11.30 నుంచి రాత్రి 12.30 గంటల వరకు హలీం లభిస్తుంది.

అడ్రస్: శ్రీ లక్ష్మీ కాంప్లెక్స్, నంబర్ 2, శాంతినగర్ కాలనీ, లక్డికాపూల్ రోడ్.

⦿ పెషావర్ రెస్టారెంట్

హైదరాబాద్‌లోని పెషావర్ రెస్టారెంట్ అద్భుతమైన హలీంను అందిస్తుంది. ఇక్కడ ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడి మటన్ ఫుడ్స్, హలీమ్, తందూరీ చికె, కబాబ్‌లు నోరూరిస్తాయి.  ప్యూర్ మటన్, గోధుమ, బార్లీ, కాయధాన్యాలు,  భారతీయ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన హలీం తింటే ఆహా అనాల్సిందే. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్థరాత్రి 1 గంటల వరకు హలీం దొరుకుతుంది.

అడ్రస్: 6-2-30/E, ఉట్కూర్ – మొగ్దుంపూర్ రోడ్, DHL ఆఫీస్ పక్కన, లక్డికాపూల్.

⦿ సర్వి

1998 ఈ రెస్టారెంట్ ప్రజలకు రుచికరమైన ఫుడ్స్ అందిస్తోంది. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ లో ఉన్న ఈ రెస్టారెంట్  మొఘలాయి, ఇరానియన్ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హలీం ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హలీం లభిస్తుంది.

అడ్రస్: 6-2-626, ఆపోజిట్ కేర్ హాస్పిటల్, రోడ్ 1 & 11, బంజారా హిల్స్.

⦿ మందార్

ఇండియన్, చైనీస్,  మొఘలాయి, అరబిక్ వంటకాలకు బాగా పాపులర్. మటన్ మండి, చికెన్ మండి, హలీమ్‌, కబాబ్‌లు ఎంతో రుచికరంగా ఉంటాయి. రంజాన్ సందర్భంగా ఇక్కడ హలీం తినేందుకు జనాలు ఎగబడుతారు. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ హలీం లభిస్తుంది.

అడ్రస్ఫ 9-4-77/F/10, టోలిచౌకి రోడ్, యూసుఫ్ టెక్రి, టోలి చౌకి.

⦿ షా ఘౌస్

దీనిని 1984లో దీనిని స్థాపించారు. ఇక్కడ బిర్యానీ, కబాబ్‌లు, హలీమ్ చాలా ఫేమస్. హైదరాబాదీ హలీమ్, హైదరాబాదీ బిర్యానీ తినేందుకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఇక్కడ హలీం లభిస్తుంది.

అడ్రస్: ప్లాట్ 103, రాయదుర్గం, షేక్‌పేట్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్.

⦿ షాదాబ్ హోటల్

ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ లాగే ఇక్కడి ఫుడ్స్ ఉంటాయి. ఇదొక సాధారణ రెస్టారెంట్ అయినా, ఇక్కడి హలీంకు సలాం చేయాల్సిందే. మొఘలాయి పద్దతిలో తయారు చేసే హలీం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు హలీం లభిస్తుంది.

అడ్రస్: మదీనా సర్కిల్, 21-1-140-144, హైకోర్టు దగ్గర, హైకోర్టు రోడ్డు, చార్మినార్

⦿ గ్రిల్ 9

గ్రిల్ 9  హైదరాబాద్‌ లో ఫేమస్ రెస్టారెంట్. మొఘలాయి రుచులు, రంజాన్ హలీంకు చాలా ప్రసిద్ధి. కబాబ్‌లు, స్మోకీ టిక్కాలకు ఆహా అనిపిస్తాయి. మాంసం, గోధుమలు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన హలీం రుచి ఆహా అనిపిస్తుంది. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.45 వరకు హలీం లభిస్తుంది.

అడ్రస్: విక్రమ్‌పురి కాలనీ, పుల్లా రెడ్డి స్వీట్స్ ఎదురుగా, జనక్ పురి

⦿ మెహ్ఫిల్

2006 నుంచి ఇక్కడ రుచికరమైన హలీం అందిస్తున్నారు. ఐకానిక్ బిర్యానీ, సుగంధ కబాబ్‌లు, హలీమ్‌ తో పాటు నార్త్ ఫుడ్స్ ఇక్కడ లభిస్తాయి. రంజాన్ మాసంలో హలీం బాగా ఫేమస్. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ హలీం లభిస్తుంది.

⦿ ప్యారడైజ్

బిర్యానీ సామ్రాజ్యానికి ప్రసిద్ధి చెందిన ప్యారడైజ్..  హలీం సీజన్‌ లో రుచికరమైన హలీం అందిస్తున్నది. హైదరాబాద్ లో బోలెడు ప్యారడైజ్ అవుట్ లెట్లలో ఎక్కడైనా తీసుకునే అవకాశం ఉంది. మెయిన్బ్రాంచ్ మాత్రం సికింద్రాబాద్ ప్యారడైజ్ లో ఉంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ హలీం లభిస్తుంది.

⦿ కేఫ్ బహార్

కేఫ్ బహర్ లో ఆహా అనిపించే బిర్యానీ లభిస్తుంది. రంజాన్ మాసంలో అద్భుతమైన హలీం లభిస్తుంది. ఇక్కడ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12.30 వరకు హలీం లభిస్తుంది.

అడ్రస్: 3-5, 815/A, ఓల్డ్ MLA క్వార్టర్స్ రోడ్, అవంతి నగర్, హిమాయత్‌నగర్

Read Also: ‘కోఠి’ పేరు వెనుక ఇంత కథ ఉందా? ఆ ప్యాలెస్ ను ఎవరు, ఎవరి కోసం కట్టించారంటే?

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×