E-Paper
Advertisement

Saggubiyyam Benefits: సీజన్ మారినా బెనిఫిట్స్ మారదు.. సగ్గుబియ్యం తింటే ఆరోగ్య ప్రయోజనాలు గ్యారెంటీ!

Saggubiyyam Benefits: సీజన్ మారినా బెనిఫిట్స్ మారదు.. సగ్గుబియ్యం తింటే ఆరోగ్య ప్రయోజనాలు గ్యారెంటీ!
Advertisement

Saggubiyyam Benefits: సగ్గుబియ్యం పేరు వినగానే చాలామందికి పాయసం, పరమాన్నం వంటి తీయని వంటల్లో ఉపయోగిస్తారనే తెలుసు. కానీ ఇది కేవలం తీపి వంటకాలకు మాత్రమే పరిమితం కాదు. సగ్గుబియ్యం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కర్రపెండలం చెట్టు నుండి వచ్చే దుంపలతో తయారు అవుతుంది. దీనివల్ల ఇది సహజంగా ప్రాసెస్ అయినా ఆరోగ్యకరమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆయుర్వేదంలోనూ సగ్గుబియ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలో సగ్గుబియ్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూసేద్దాం.

శరీరానికి చలువ అందిస్తుంది:

సగ్గుబియ్యం లేదా సాబుదానాగా పిలిచే ఈ పదార్థం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీనిలో పిండిపదార్థాలు అధికంగా ఉండటంతో జావలా వండుకుంటే.. పొట్టలో అసౌకర్యం తగ్గి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఉదయం పూట సగ్గుబియ్యాన్ని తీసుకుంటే ఆ రోజంతా శరీరానికి శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఈ సగ్గుబియ్యాన్ని వేసవిలో వేడి తగ్గించుకోవడాని ఎక్కువగా తీసుకుంటారు. అంతేకాదు.. ఎక్కువ వేడి శరీరం ఉన్నవారికి, కారం, మసాలా ఉన్న ఆహారం తింటే ఇబ్బంది పడేవాళ్లకి సగ్గుబియ్యం ఉపశమనాన్ని కలిగిస్తుంది. పాలు లేదా నీటిలో ఉడికించి.. కొద్దిగా చక్కెర కలిపి తింటే పొట్టలో అసౌకర్యం, శరీరంలో వేడి తగ్గి ఇట్టే తగ్గిపోతుంది.

Advertisement

Also Read: ‘58 నిమిషాల పని-2 నిమిషాల వ్యాయామం’.. ఈ సింపుల్ ఫార్ములాను ఫాలో అవుతున్నారా?

పోషకాలు మెండు:

సగ్గుబియ్యం జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని తరచూ తీసుకుంటే.. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే అజీర్తి తగ్గి గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం లేదా విరేచన సమస్యలను కూడా సగ్గుబియ్యం ద్వారా నియంత్రించవచ్చు. దీనిలోని పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ సి, క్యాల్షియం శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంతో వృద్ధులు, పిల్లలందరికీ సులభంగా జీర్ణమవుతుంది. రోజూ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గి పేగుల సమస్యలు పరిష్కారమవుతాయి.

లాభాలు అనేకం:

Advertisement

ఎముకల ఆరోగ్యానికి సగ్గుబియ్యం ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచి, విరిగిన ఎముకల చికిత్సలో కూడా ఉపకరిస్తుంది. నీరసం, అలసట, బద్దకంలా అనిపించే వారికి సగ్గుబియ్యం శక్తి, ఉత్సాహం కలిగిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు సగ్గుబియ్యాన్ని జావగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, రక్త సరఫరా మెరుగుపటడం, బీపీ నియంత్రణ, హైబీపీ ఉన్నవారికి ఉపశమనం లభించడం వంటి అనేక లాభాలను అందిస్తుంది. అయితే గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ 80 వరకు ఉండటంతో, మధుమేహులు సగ్గుబియ్యం ఎక్కువగా తినకూడదు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ తీసుకుంటే సగ్గుబియ్యం మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Also Read: టూత్‌బ్రష్ విషయంలో చాలామంది చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×