MTV Music Shutdown: MTV ఐకానిక్ మ్యూజిక్ ప్రస్థానం ముగియనుంది. ఈ లెజెండరీ నెట్‌వర్క్ షాకింగ్ నిర్ణయంతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ నెట్ వర్క్ లోని ఐదు మ్యూజిక్ ఛానెల్‌లు MTV మ్యూజిక్, MTV 80, MTV 90, క్లబ్ MTV, MTV లైవ్ ను డిసెంబర్ 31, 2025 నాటికి యూకేలో మూతపడనుంది.
అయితే MTV HD రియాలిటీ షోలను ప్రసారాలు కొనసాగనున్నట్లు యూకే బీబీసీ నివేదించింది. మ్యూజిక్ వీడియోలు, ఆర్టిస్ట్ ప్రమోషన్‌పై ఎంటీవీ తమ ముద్రను వేసింది. ఎంటీవీ నిర్ణయంతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. MTV మాజీ వీడియో జాకీ సిమోన్ ఏంజెల్ ఈ ప్రకటనపై స్పందిస్తూ.. ఈ నిర్ణయం తనను షాక్ కు గురిచేసిందని, ఇది చాలా విచారకర నిర్ణయం అన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. తాను దీనిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానన్నారు. కళలను, కళాకారులను ఎంటీవీ కలిపిందన్నారు.
MTVలో ఏంజెల్ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. తామంతా అక్కడ చాలా సరదాగా గడిపామన్నారు. ఇంటర్నెట్ యుగానికి ముందు MTV యూరప్ సాంస్కృతిక ప్రభావాన్ని ప్రతిబింబించిందన్నారు. ఇంటర్నెట్ లేని సమయంలో ఎంటీవీ ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన టీవీ ఛానల్, 100 నుంచి 150 మిలియన్ల మంది వీక్షకులతో ఉండేవారని ఆమె చెప్పింది.
MTV మ్యూజిక్ ఛానెల్‌లు మూతపడుతున్నప్పటికీ MTV బ్రాండ్ ఐకానిక్‌గా ఉందని ఏంజెల్ చెప్పింది. ఇప్పటి వరకూ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్‌లలో ఎంటీవీ ఒకటి అన్నారు.
MTV 1981లో యూఎస్ లో ప్రారంభించారు. ఎంటీవీ ‘వీడియో కిల్డ్ ది రేడియో స్టార్’తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. 1987లో MTV యూరప్ అడుగుపెట్టింది. 1997లో MTV యూకే ప్రత్యేక ఛానెల్‌ను ప్రారంభించింది. 1980, 1990లలో మ్యూజిక్, పాప్ సంస్కృతిని రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. యూకే సంగీత టెలివిజన్ చరిత్రలో ఒక అధ్యాయం ముగుస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Jadav Payeng : ‘ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జాదవ్ పయెంగ్ కు ‘ సంకల్ప కిరణ్ పురస్కారం..
మ్యూజిక్ ఛానల్స్ ముగింపుపై ఎంటీవీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎంటీవీ మ్యూజిక్ కంపెనీ సేవలు యూకే, ఐర్లాండ్‌లో మూతపడటం మొదలయ్యాయి. యూరప్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా త్వరలో ఈ ఛానల్స్ మూతపడనున్నాయి. దాదాపు 40 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఎంటీవీ ఇంత గడ్డు పరిస్థితిని చేరుకుంది. అయితే కంపెనీ మూసివేతపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇంటర్నెట్ యుగంలో మ్యూజిక్ వీడియోలకు ఆదరణ తగ్గిపోయింది. అలాగే ఆదాయమార్గాలు సన్నగిల్లాయి.