Hibiscus for Glowing Skin: ముఖం చాలా అందంగా, మెరిసేలా ఉండాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వేలకు వేలు ఖర్చు చేసి పార్లర్ చుట్టూ తిరుగుతుంటారు. అయినా ఫలితం ఉండది. పైగా వాటివల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండ, పొల్యూషన్ వల్ల చర్మం మరింత డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి మన ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో ఫేస్ మాస్క్‌లు, ఫేసియల్స్ తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం మందారం పువ్వుతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి.. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. సాధారణంగా మందారం పువ్వును జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తారు. ఇది కేవలం జుట్టుకు మాత్రమే కాదు.. చర్మ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీబాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ముఖాన్ని మెరిపించడానికి సహాయపడతాయి. ఇంకెందుకు ఆలస్యం మందారం పువ్వుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మందారం, పాలు, తేనె ఫేస్ ప్యాక్
ముందుగా మందార పువ్వులను ఎండబెట్టాలి. తర్వాత వీటిని పొడిచేసుకోవాలి. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ మందార పువ్వు పొడి, తేనె, పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. ముఖం కలువలా కళకళ్లాడుతుంది.
మందారం పువ్వు, పాలు, పసుపు ఫేస్ ప్యాక్
మందార పువ్వును మెత్తగా పేస్ట్ చేసుకొని.. అందులో టేబుల్ స్పూన్ పాలు, చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖం తాజాగా మెరుస్తుంది. ముఖంపై మురికి తొలగిపోతుంది.
మందారం పువ్వు, అలోవెరా జెల్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్
మందార పువ్వు పొడిని చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో అలోవెరా జెల్ టీ స్పూన్, రోజు వాటర్ రెండు టేబుల్ స్పూన్ వేసి బాగా కలపండి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం చాలా అందంగా, కాంతి వంతంగా మెరుస్తుంది.
మందారం పువ్వు, తేనె, ముల్తానీ మిట్టి
మందార పువ్వు పొడిలో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని.. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ ముఖం తాజాగా మిలమిల మెరుస్తుంది.
Also Read: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలా.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.