Actress Sirisha : ఇండస్ట్రీలో ఒకప్పుడు తెలుగు వాళ్లకు ఉన్న ప్రాథమిక ఈమధ్య లేదు అంటూ కొందరు నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈమధ్య చాలామంది చేతిలో అవకాశాలు లేకపోవడంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఈ మధ్య పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఎన్నో విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా సీరియల్ యాక్టర్ శిరీష ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ శిరీష ఏమన్నారు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
ఒక్కపూట అన్నం కోసం కష్టాలు..
బుల్లితెరపై వరుసగా సీరియస్ చేసుకుంటూ బిజీగా ఉండేది. సీరియల్ లోకి రాకముందు ఆమె పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని గతంలో ఎన్నోసార్లు బయటపెట్టింది. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని కష్టాలను బయటపెట్టి ఎమోషనల్ అవుతుంది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పుడు మేము చాలా కటిక పేదరికంలో ఉండే వాళ్ళం.. ఒక్క పూట భోజనం కోసం మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారు. మా అమ్మ పాచి పనికి వెళ్తే మా నాన్న ఏదో ఒక పని చేసుకుని మాకు కడుపు నింపేవాడు. అక్కలు పెద్దయిన తర్వాత 75 రూపాయలకి, 90 రూపాయలకి అన్నయ్య సూపర్ మార్కెట్లలో పని చేసే వాళ్ళు. కొన్నిసార్లు అన్నం లేక బియ్యం నూకని వండుకొని గంజి తాగే వాళ్ళం. ఆ తర్వాత సీరియల్స్ లో అవకాశం రావడంతో అలా ఒక్కో సీరియల్తో నేను నా ఇంటిని కష్టాల నుంచి దూరం చేశాను అంటూ శిరీష కన్నీళ్లు పెట్టుకున్నారు.
మా అక్క వాళ్ళు కూడా సీరియస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి కష్టాల్లో మా వాళ్ళని పడేయకూడదని నేను చాలా బాధలు అనుభవిస్తూనే ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను.. కానీ తెలుగు వాళ్లను అవకాశలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. బుల్లితెర పై మాత్రమే కాదు వెండి తెరపై కూడా హీరోయిన్లుగా రానివ్వట్లేదు అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు..
Also Read : ఇంత మారిపోయావేంటి బ్రో..ఇది అస్సలు ఊహించలేదు..
ఉద్యోగం కోసం వెళ్తే అవమానించేవారు..
శిరీష ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీరియల్స్ లో కూడా తెలుగు వాళ్లకి పెద్దగా అవకాశలు ఇవ్వడం లేదు. సినిమాల్లో ఎలాగైతే తెలుగు హీరోయిన్లు కనిపించరు. బుల్లితెరపై కూడా అలాగేనే వేరే భాషల్లోని హీరోయిన్లను తీసుకువచ్చి వాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా డబ్బింగ్ లో మ్యారేజ్ చేసిన మరి సీరియల్స్ ని సాగిస్తూ ఉంటారు. అదేంటో మరి తెలుగు వాళ్ళలో లేనిది వేరే భాషల్లోని వాళ్లలో ఎలా ఉంటుందో ఏముంటుందో మాకు అర్థం కావట్లేదు అని శిరీష ఎన్నో విషయాలను బయటపెట్టింది.. ఒకవేళ ఇబ్బందులు పడకుండా ఉద్యోగానికి వెళ్లాలి అనుకుంటే సీరియల్స్లలో హీరోయిన్ అయి ఉండి ఇప్పుడు ఇలా ఉద్యోగానికి వస్తున్నారా అని చిన్న చూపు చూస్తారు.. ఎటు పోయినా కూడా మాకు ఇబ్బందులే.. సీరియల్స్లలో తెలుగు వాళ్లకు అవకాశాలు ఎప్పుడు ఇస్తారో చూడాలి.. నేనే కాదు చాలామంది తెలుగు వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ శిరీష అంటున్నారు. మొత్తానికి ఏమైనా ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..