White Hair Tips: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. నిండా 25 ఏళ్లు రాకుండానే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇందుకు ప్రధానంగా స్ట్రెస్‌కి గురికావడం, బయట దుమ్మూ, ధూళి, కాలుష్యం కారణాలు కావచ్చు. మరికొంత మందికి చిన్నతనంలోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. దీనిని బాల నెరుపు అంటారు. వైట్ హెయిర్‌ని కవర్ చేసేందుకు మార్కెట్లో లభించే హెయిర్ ప్యాక్‌లు, ఆయిల్స్, హెయిర్ సీరమ్స్ వంటివి ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. ఒకవేల ఉన్న అవి టెంపరరీగా పనిచేస్తాయి కానీ.. పర్మినెంట్‌గా ఉండవు. పైగా వాటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒక్కసారి ఈ చిట్కాను పాటించండి.. జీవితంలో తెల్లజుట్టు సమస్యలు రావు. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
⦿ హెయిర్ ప్యాక్‌కు కావాల్సిన పదార్దాలు..
⦿ కరివేపాకు
⦿ గోరింటాకు పొడి
⦿ మెంతులు
⦿ వేపాకు
⦿ లవంగాలు
⦿ కొబ్బరి నూనె
⦿ తయారు చేసుకునే విధానం..
ముందుగా వేపాకు, కరివేపాకు శుభ్రంగా నీటితో కడిగి మిక్సీజార్‌లోకి తీసుకోండి. అందులో లవంగాలు 20, మెంతులు అరకప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టండి. ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకని అందులో గోరింటాకు పొడి వేసి, బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే సరిపోతుంది. జీవితంలో తెల్లజుట్టు సమస్యలు దరిచేరవు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పొడవుగా, నల్లగా, సిల్కీగా మారుతుంది.
తెల్లజుట్టు నల్లగా మారేందుకు ఈ చిట్కా కూడా ట్రై చేయండి. అద్భుతమైన రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల జుట్టు కుదుళ్లు కూడా ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.
⦿ కావాల్సిన పదార్ధాలు..
⦿ డై ఆమ్లా
⦿ నిగెల్లా సీడ్స్
⦿ మెంతులు
⦿ పసుపు
⦿ కొబ్బరి నూనె
⦿ తయారు చేసుకునే విధానం..
ముందుగా మిక్సీజార్ లో డై ఆమ్లా, నిగెల్లా సీడ్స్, మెంతులు, పసుపు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని అందులో తయారు చేసుకున్న పొడిని వేసి నల్లగా మారేంతవరకు వేయించాలి. ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని.. కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టుకూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది కూడా.
Also Read: రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్ర.. అయినా ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారట.. అదెలా?
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.