 
					Kerala Style Ulli Vada: వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఒక కప్పు టీ చేతిలో ఉంటే, దానికి సరిపోయే స్నాక్ ఏంటంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది వడా. కానీ ఈరోజు చెప్పబోయేది సాధారణ వడా కాదు, కేరళ స్టైల్ ఉల్లి వడా. సౌత్ ఇండియాలో చాలా ప్రసిద్ధి పొందిన ఈ వడ, తిన్నవారికి మరువలేని రుచి ఇస్తుంది. బయట కుర్రకుర్రగా, లోపల మృదువుగా ఉండే ఈ ఉల్లి వడ, చల్లటి సాయంత్రం లేదా వర్షకాలంలో టీతో తింటే మనసు తేలికగా అనిపిస్తుంది.
కావాల్సింది ఇవే..
ఉల్లి వడ అంటే ఉల్లిపాయలతో తయారు చేసే పకోడా అనే అర్థం. కానీ కేరళ స్టైల్‌లో దీన్ని కొంచెం భిన్నంగా చేస్తారు. సాధారణంగా మనం చేసే పకోడాలకు బేసన్ లేదా శనగపిండి మాత్రమే వేస్తాం. కానీ ఇందులో బేసన్‌తో పాటు బియ్యపు పిండి కూడా వేస్తారు. అందుకే వడా కరకరలాడేలా కాకుండా, కాస్త మృదువుగా కానీ సూపర్ రుచిగా వస్తుంది. ఉల్లిపాయల తీపి, మసాలాల రుచి కలిసినప్పుడు ఈ వడా ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
ఉల్లి వడ ఎలా తయారు చేయాలి?
తయారీలో ముందుగా ఉల్లిపాయలను పలుచగా తరగాలి. పెద్ద బౌల్‌లో వేసి కొద్దిగా ఉప్పు కలపాలి. ఉల్లిపాయలు తేమను విడుదల చేస్తాయి, అదే ఈ వడా బంధం. ఆ తరువాత కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, మిరపకాయ ముక్కలు కలపాలి. తరువాత బియ్యపు పిండి, బేసన్, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఎక్కువ నీరు వేయకూడదు, కాస్త గట్టిగా పిండిలా ఉండాలి.
Also Read: Amazon Pay: జీరో ఫీతో మొబైల్ రీచార్జ్.. అమెజాన్ పేలో ప్రతి రీచార్జ్‌కి స్క్రాచ్ కార్డ్ రివార్డ్స్
తర్వాత కడాయిలో నూనె వేడి చేసి చిన్న చిన్న వడల్లా వేస్తూ మరో చేత్తో గెరిటెతో తిప్పుతూ వేసి వేయించాలి. ఒకేసారి ఎక్కువ వేయడం మంచిది కాదు, చిన్న బ్యాచ్‌లుగా వేస్తే వడలు బాగా ఉడుకుతాయి. బంగారు రంగులోకి మారిన తర్వాత తీసి టిష్యూపేపర్ మీద పెట్టాలి, దానిలో వున్న నూనె పోవడానికి. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తినడం మంచిది. ఆ వేడికి రుచికి తగ్గట్టు ఉంటాయి. చల్లారిన తర్వాత రుచి తగ్గిపోతుంది.
ఉల్లి వడతో కాంబినేషన్ ఇవే..
ఈ ఉల్లి వడా చట్నీతో లేదా సాదా చాయ్‌తో తింటే రుచికి రుచి జోడిస్తుంది. కొందరు దీన్ని పొంగల్ లేదా దోశలతో కూడా తింటారు. కేరళలో అయితే ఈ వడాలను కర్రీలో ముంచి వడ్డిస్తారు. ఏ రూపంలో తిన్నా రుచే వేరుగా ఉంటుంది.
ఉల్లిపాయ నాణ్యత కూడా చాలా ముఖ్యం. కేరళలో సాధారణంగా ఎరుపు ఉల్లిపాయలు వాడతారు, కానీ తెల్ల ఉల్లిపాయలు లేదా బ్రౌన్ ఉల్లిపాయలు కూడా సరిపోతాయి. వడలు వేయించే సమయంలో మంట మధ్యస్థంగా ఉంచాలి. మంట ఎక్కువ అయితే బయట కాలిపోతుంది, లోపల ఉడకదు. మంచిగా వేయించుకోవాలి.
సౌత్ ఇండియన్ వంటలలో ప్రత్యేక స్థానం
కేవలం 15–20 నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ కేరళ స్టైల్ ఉల్లి వడ వర్షాకాలానికి బాగా సరిపోతుంది. ఇంట్లో పదార్థాలు కూడా సులభంగా దొరుకుతాయి. ఒక కప్పు వేడి టీతో ఈ వడ తింటే మనసుకి కంఫర్ట్‌గా ఉంటుంది. రుచిలో తీపి, కారం, ఉప్పు, మసాలా అన్నీ సమంగా కలిసిన ఈ వడ సౌత్ ఇండియన్ వంటలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అదే కేరళ స్పెషల్ ఉల్లి వడ. సాధారణంగా కనిపించే పకోడాల్లా కాదు, రుచిలో మాత్రం అసాధారణం. ఒక్కసారి ప్రయత్నించండి, ఈ వడ రుచి మీ ఇంట్లో అందరికీ నచ్చకుండా ఉండదు.