BigTV English

Korean Glass Skin: బీట్ రూట్ ఫేస్ జెల్‌తో.. కొరియన్ గ్లాసీ స్కిన్ గ్యారంటీ !

Korean Glass Skin: బీట్ రూట్ ఫేస్ జెల్‌తో.. కొరియన్ గ్లాసీ స్కిన్ గ్యారంటీ !

Korean Glass Skin: ప్రతి అమ్మాయి కొరియన్ లాగా గ్లాసీ స్కిన్ కోసం కలలు కంటుంది. చాలా మంది ఇందుకోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించినప్పటికీ మెరిసే చర్మాన్ని పొందలేరు. కానీ కొరియన్స్ స్కిన్ కేర్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటుంది. అంతే కాకుండా వారు ఉపయోగించే బీట్ రూట్ జెల్ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మీ చర్మం పూర్తిగా ప్రకాశవంతంగా మారుతుంది. మీరు ఈ జెల్‌ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.


కొరియన్స్ లాంటి గ్లాసీ చర్మాన్ని కూడా పొందవచ్చు. ఈ జెల్ చర్మానికి మెరుపును అందించడంతో పాటు, చర్మ సమస్యలను కూడా తొలగించి, మీ చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. కాబట్టి మీరు ఈ జెల్‌ను ఎలా తయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ జెల్ తయారీ:
కావాల్సినవి:
బీట్‌రూట్ – 1
రోజ్ వాటర్ – 2 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్ – 1 స్పూన్
గ్లిజరిన్ – 1 స్పూన్


తయారు చేసే విధానం:

ముందుగా బీట్‌ రూట్‌ను సరిగ్గా తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. దీని తరువాత ఈ ముక్కలను మిక్సర్‌లో వేసి పేస్ట్ లాగా చేయాలి. తర్వాత
బీట్‌ రూట్ పేస్ట్‌ను వడకట్టి ఒక పాత్రలో దాని రసాన్ని తీయండి.
ఇప్పుడు ఫేస్ జెల్ సిద్ధం చేయడానికి, బీట్‌ రూట్ రసంలో 1 టీస్పూన్ రోజ్ వాటర్ టీస్పూన్ కలబంద జెల్ , గ్లిజరిన్ వేసి బాగా కలపండి.

నిల్వ చేయండి:
ఇప్పుడు ఇలా తయారుచేసిన ఫేస్ జెల్‌ను ఒక సీసాలో ఉంచి, రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేసి, ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి.

బీట్‌రూట్ ఫేస్ జెల్ ప్రయోజనాలు:

1.ఈ ఫేస్ జెల్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
2. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి.
3. బీట్ రూట్ మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా, ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా మారుస్తుంది.
4. ఈ జెల్ యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.
5. ఈ జెల్ వాడటం వల్ల మీ ముఖంపై మృత చర్మం తొలగిపోయి, చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఇనుము, విటమిన్లతో నిండిన ఈ బీట్ రూట్ జెల్ మీ చర్మాన్ని లోపలి నుండి పోషణనిస్తుంది. మీకు ప్రకాశవంతమైన రంగును అందిస్తుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు చర్మాన్ని లోపలి నుండి తేమను అందిస్తాయి.

Also Read: వీటిని వాడితే.. పొడవాటి జుట్టు పక్కా !

ముడతలు, మొటిమల నుండి నల్లటి మచ్చలు వరకు ప్రతి దానినీ ఎదుర్కొనేందుకు బీట్ రూట్ జెల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది . హైడ్రేటింగ్ , పోషక లక్షణాలతో సమృద్ధిగా ఉన్న బీట్‌ రూట్‌ జెల్ మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది.

బీట్‌రూట్ జెల్ నల్లటి మచ్చలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది . ఇందులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది హైపర్‌ పిగ్మెంటేషన్‌ను తగ్గించి, మరింత రంగును మరింత మెరుగుపరుస్తుంది.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×