Long Hair Secret: ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి జుట్టును కోరుకుంటారు. కానీ చెడు జీవనశైలి , బిజీ లైఫ్ స్టైల్ కారణంగా, జుట్టు బలహీనంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలోనే కొంత మంది ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ జుట్టు సరిగ్గా పెరగదు. మహిళలు తమ జుట్టును పొడవుగా, మందంగా చేసుకోవడానికి హోం రెమెడీస్ కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు ఆవనూనెకు ఒక రహస్య పదార్థాన్ని కలిపి మీ తలపై బాగా మసాజ్ చేయాలి. తద్వారా మీ జుట్టు పొడవుగా, నల్లగా మారుతుంది. కాబట్టి మీ జుట్టు పొడవుగా, మందంగా పెరగడానికి ఆవ నూనెలో ఏం కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు:
జుట్టు పొడవుగా, మందంగా మారాలంటే మెంతులు వాడటం మంచిది. మెందుల్లో ప్రొటీన్, ఐరన్, పొటాషియం, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుని మూలాల నుండి బలంగా మారుస్తాయి. అంతే కాకుండా చుండ్రు సమస్యను కూడా తొలగిస్తాయి. ఈ హోం రెమెడీ కోసం ఆవ నూనెలో మెంతి గింజలను కలిపి నూనె తయారు చేసుకోవాలి. ఇది మీ జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తుంది.
ఎలా వాడాలి ?
ఆవ నూనెలో మెంతులు కలిపి హోం రెమెడీ తయారు చేయడానికి 2 కప్పుల ఆవ నూనెను తక్కువ మంట మీద వేడి చేయండి. తర్వాత అందులోనే 1/2 కప్పు మెంతులు వేయండి. 20-30 నిమిషాల తర్వాత మంటను ఆపివేసి ఆయిల్ చల్లారనివ్వండి. ఆయిల్ చల్లారిన తర్వాత నూనెను వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోండి. ఈ నూనెతో మీ తలకు క్రమం తప్పకుండా మసాజ్ చేసి, ఆపై మీ జుట్టును వాష్ చేయండి. ఇది మీ జుట్టును పొడవుగా, మందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా నిరోధిస్తుంది.
మెంతి గింజల నూనె:
ఒక చిన్న కప్పు మెంతి గింజలను తీసుకుని కొబ్బరి నూనె, ఆలివ్ నూనెలో వేసి వేడి చేయండి. నూనె చల్లబడిన తర్వాత, దానిని జుట్టు మూలాలకు బాగా మసాజ్ చేయండి. మీరు ఈ నూనెను రాత్రంతా మీ జుట్టుకు అలాగే ఉంచండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీ జుట్టును వాష్ చేసుకోండి.
మెంతుల పేస్ట్:
ముందుగా ఒక చిన్న కప్పు మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు దానిని బాగా రుబ్బుకుని, దానికి 2 చెంచాల పెరుగు కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 30-45 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయండి. మెంతుల పేస్ట్ తల చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా జుట్టును బలపరుస్తుంది.
Also Read: పార్లర్‌కు వెళ్లాల్సిన పనే లేదు, ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా !
మెంతి గింజల, నీరు :
మెంతి గింజలను ఉపయోగించడానికి ఇది సులభమైన మార్గం. దీని కోసం, మీరు తగినంత మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని త్రాగాలి. దీనివల్ల జుట్టు అంతర్గత బలం పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు బలంగా మారుతుంది.
మెంతి గింజలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి:
మీరు వాటిని క్రమం తప్పకుండా మెంతులను జుట్టు కోసం ఉపయోగించవచ్చు. కానీ మీకు ఏదైనా అలెర్జీ ఎదురైతే వాటిని వాడటం మానేయండి. మెంతులు తినడానికి లేదా చర్మంపై ఎటువంటి హాని కలిగించకుండా ఉండేందుకు ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.