BigTV English

Neera Cafe: నీరా కేఫ్ వివాదం.. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారంపై స్పందించిన రేవంత్ సర్కార్

Neera Cafe: నీరా కేఫ్ వివాదం.. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారంపై స్పందించిన రేవంత్ సర్కార్

Neera Cafe: ప్రతిపక్షాలు బీసీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే యోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏదో ఓ కుట్ర చేసి బీసీల మనసు విరిచే యత్నంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. గౌడన్నల ఆత్మగౌరవానికి ప్రతీకగా పెట్టిన నీరా కేఫ్ ని మూసి వేస్తున్నారంటూ ఓ పత్రిక ఆర్టికల్ రాసింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఈ పత్రికలో లేని కథనాన్ని ఉన్నట్టు రాయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అలాంటి యత్నాలేవీ జరగటం లేదనీ.. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు సదరు పత్రికకు రీజాయిండర్ సైతం పాస్ చేసింది.


ALSO READ: CM Revanth Reddy: ఇవి నిజమైతేేనే మాకు ఓటు వేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

HYD, ట్యాంక్‌బండ్‌ నెక్లెస్‌ రోడ్డులో KCR  ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన నీరాకేఫ్‌ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. నీరాకేఫ్‌ను అక్కడి నుంచి తీసివేసి దాన్ని హోటల్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కేఫ్‌ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. నీరా కేఫ్‌ను సుల్తాన్ బ‌జార్‌లోని చాట్ భండార్‌లాగా మార్చార‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై ఫైరయ్యారు. కాగా నీరాకేఫ్‌ను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని మానుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.


ఆ పత్రికలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం.. ట్యాంక్ బండ్ పై గల నీరా కేఫ్ మూసి వేస్తారని వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నీరా కేఫ్ అక్కడే కొనసాగుతుందని.. మూసివేసే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ కేఫ్ ప్రారంభం నుంచే ఫుడ్ కోర్టులు కూడా ఒక భాగం. అయితే ఇక్కడి నుంచి నీరా కేఫ్ ని తీసేసి హోటళ్లు తెరుస్తారని పత్రికలో రావడం విచారకరంగా భావిస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం బీసీల ఉన్నతికి కులగణన వంటి ఎన్నోయత్నాలు చేస్తుండగా.. కావాలని బీసీలపై ఏదో ఒక కుట్ర పన్నుతూ.. అనవసర పుకార్లు పుట్టించి.. తద్వారా సోషల్ మీడియాలో అలజడి సృష్టించే గులాబీ కుట్రలో ఇది కూడా ఒక భాగమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ALSO READ: Manager Jobs: డిగ్రీ అర్హతతో మేనేజర్ ఉద్యోగాలు.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

ఈ క్రమంలోనే నీరాకేఫ్‌ వివాదంపై ప్రభుత్వం స్పందించింది .హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు నీరా కేఫ్‌పై ఎక్సైజ్ శాఖ అధికారులు ఇవాళ ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. నీరా కేఫ్‌ను మూసివేయాలనే ప్రతిపాదనలు తమకు లేవని క్లారిటీ ఇచ్చారు. మొదటి నుంచి ఫుడ్ కోర్టులు కేఫ్‌లో భాగంగానే ఉన్నాయని తెలిపారు. నీరా కేఫ్‌ను తొలగించి అక్కడ హోటళ్లు ఏర్పాటుచేసే ప్రతిపాదనలు లేవని తేల్చి చెప్పారు. నీరా కేఫ్‌ను డాక్టర్ వినోద్ గౌడ్‌కు చెందిన మెస్సర్స్ తనీరా పామ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తోందని వివరించారు. నీరా కేఫ్ ఇప్పటికీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఎక్సైజ్ శాఖ క్లారిటీ ఇచ్చింది.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×