Summer Face Packs: సమ్మర్ ప్రారంభం అవగానే చెమట, దుమ్ము, సూర్యకాంతి మన శరీరాన్ని అలసిపోయేలా చేస్తాయి. ఇవి మన చర్మంపైనే అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా వేసవిలో చర్మం జిడ్డుగా మారుతుంది. కానీ చాలా మందికి ఈ సీజన్‌లో కూడా చర్మం పొడిబారినట్లు అనిపిస్తుంది. దీనికి కారణం తీవ్రమైన సూర్యకాంతి, తరచుగా ముఖం కడుక్కోవడం, AC వాడటం అంతే కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.
సమ్మర్ లో మీ చర్మం పొడిగా, నిర్జీవంగా అనిపిస్తే ఆందోళన చెందకండి. మీ చర్మానికి తేమ, మెరుపును ఇచ్చే హోం రెమెడీస్ ట్రై చేయండి. వీటిని ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు.
1. శనగపిండి, పాలో ఫేస్ ప్యాక్ :
శనగపిండి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఈ ప్యాక్ చర్మం నుండి మృత కణాలను తొలగించి.. తేమను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. దీనికోసం.. ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండి, 2 చెంచాల పచ్చి పాలు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి 15 నిమిషాలు అప్లై చేయాలి. ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న నలుపు పూర్తిగా తొలగిపోతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
2. క్రీమ్:
స్నానానికి ముందు ముఖం, చేతులు, కాళ్ళపై క్రీమ్ రాయడం వల్ల చర్మానికి కావాల్సిన తేమ లభిస్తుంది. చర్మం ఎక్కువగా పొడిగా ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్నానానికి 10 నిమిషాల ముందు దీనిని అప్లై చేసి.. ఆపై ఎప్పటిలాగే స్నానం చేయండి. దీని ప్రభావం మీకు మొదటిసారి వాడిన వెంటనే కనిపిస్తుంది.
3. పెరుగు, తేనె:
పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ముఖంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. తేనె చర్మంలో తేమ , మృదుత్వాన్ని నిలుపుతుంది. పెరుగు , తేనెను తగిన మోతాదులో తీసుకుని బాగా కలిపి మీ చర్మంపై అప్లై చేయండి. దీంతో స్కిన్ పొడిబారడం క్రమంగా తగ్గుతుంది. అంతే కాకుండా చర్మం తాజాగా కనిపించడం ప్రారంభిస్తుంది. దీనిని వారానికి రెండుసార్లు ఉపయోగించినా కూడా మంచి లాభాలు ఉంటాయి.
4. రోజ్ వాటర్ , గ్లిజరిన్:
వేసవిలో చర్మంపై తేమను ఉంచడానికి చౌకైన , అత్యంత ప్రభావవంతమైన మార్గం ఇవి. రోజ్ వాటర్, గ్లిజరిన్‌లను సమాన పరిమాణంలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. రాత్రి పడుకునే ముందు ముఖం , మెడపై దీన్ని స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల ఉదయం పూట మీ చర్మం పూర్తిగా తాజాగా మారుతుంది. అంతే కాకుండా మృదువుగా ఉంటుంది.
Also Read: ఈ ఫేస్ సీరం వాడితే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
5. దోసకాయ, కలబంద :
దోసకాయ యొక్క చల్లదనం, కలబంద యొక్క తేమ చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి. వీటితో తయారు చేసి ఫేస్ ప్యాక్ తీవ్రమైన ఎండ వల్ల రంగు మారిన చర్మానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. దీనికోసం.. దోసకాయ రసం, తాజా కలబంద జెల్ కలిపి ముఖంపై 20 నిమిషాలు అప్లై చేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. వీటిని తరచుగా వాడటం వల్ల ముఖంపై పేరుకుపోయిన నలుపు పూర్తిగా తొలగిపోతుంది.