Viral Video: మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వర్షాలు, వరదలతో అడవి నుంచి పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ఓ ఊళ్లోకి అడవి నుంచి ఓ పెద్దపులి బయటకొచ్చింది. మద్యం మత్తులో ఉన్న రాజు పటేల్ (52)కి కనిపించింది. మద్య మత్తులో ఉన్న రాజు పిల్లి అనుకొని పులి తల నిమిరాడు. అంతే కాకుండా తన దగ్గర ఉన్న మద్యం తాగించే ప్రయత్నం చేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు పులి ఏమిచేయకపోవడంతో బతికిపోయాడు. తర్వాత అటవీశాఖ అధికారులు పులి అడివి దాటి వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. చివరికి నానా తిప్పలు పడి దాన్ని తిరిగి అడవిలోకి పంపించారు. పులి వల్ల ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.