Nani : టాలీవుడ్ హీరో నాని అంటే ఒక బ్రాండ్.. ఇటీవల నాని నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని అందుకుంటున్నాయి. ఏడాది రిలీజ్ అయిన రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటు కోట్లు వసూల్ చేశాయి. ఈ ఏడాది యాక్షన్ మూవీ హిట్ 3 తో మే 1 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ లో నాని దూకుడు పెంచాడు. పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు నాని. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నాని తన సినిమా కెరియర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అసలు నాని ఏమన్నాడు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అందులో ఏం అన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హిట్ 3 మూవీ..
నాని హీరోగా మాత్రమే కాదు. డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా పలు సినిమాలను నిర్మిస్తున్నారు. ఈరోజు మధ్య కోర్ట్ మూవీని నిర్మించాడు. ఆ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు నాని. హీరోగా హిట్ సినిమా ప్లాన్ చేసి లో హిట్ 3 మూవీలో రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటుగా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో, మూడో పార్ట్ పై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న నాని ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read : జానుతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. నేను చేసిన తప్పు అదే..?
నాని ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
హీరో నాని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేశాడు. ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు గుర్తు లేదు. మా టీం మెంబర్స్ చెక్కులు తీసుకొస్తే సంతకాలు చేసి ఇచ్చేవాడిని.. కానీ నేను ఒకరి దగ్గర తీసుకున్న రెమ్యూనరేషన్.. అందులోను మొదటగా తీసుకున్న డబ్బులు నాకు ప్రత్యేకం అని నాని అన్నారు. అల్లరి బుల్లోడు సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. అందరితోపాటు నాకు కూడా నెల ఆఖరికి జీతం ఇచ్చారు.. చెక్కు వద్దు అని చెప్పడంతో అన్ని వంద రూపాయలు నోట్లు నాకు ఇచ్చారు. ఇచ్చింది 4000.. 100 నోట్లు కావడంతో జేబులో పెట్టుకొని తిరుగుతుంటే ఏదో లక్షల సంపాదించిన ఫీలింగ్ నాకు ఉండేది అని నాని ఇంటర్వ్యూలో చెప్పాడు. మొదటి నెల తర్వాత మూడు నెలలు నా జీతాన్ని దాచుకొని మా అమ్మ నాన్నలకు ఉంగరాలు కొనిపించాను. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను అని నాని తన కెరియర్ మొదట్లో జరిగిన స్వీట్ మెమోరీస్ ని పంచుకున్నాడు. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిట్ 3 మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో పారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది..